Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే !
బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ వెళ్లిపోయింది. అలాగని ఈ వారంతం ఎలిమినేషన్ లేదు అనుకోకండి.

బిగ్‌బాస్ హౌస్ నుంచి అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ వెళ్లిపోయింది. అలాగని ఈ వారంతం ఎలిమినేషన్ లేదు అనుకోకండి. ఈసారి ఎలిమినేషన్‌పై తీవ్ర ఉత్కంఠ నెెలకుంది. అందులో అమ్మా రాజశేఖర్, సుజాత హై రిస్క్‌లో ఉన్నారు. కాగా సుజాత్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అమ్మా రాజశేఖర్‌ను తమిళ తంబీల ఓట్లు కాపాడాయట.
నవ్వే మైనస్, నాగ్‌ను బిట్టూ అనడంతో ఫ్యాన్స్ హర్ట్ :
ముఖ్యంగా సుజాత నవ్వుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె నవ్వు ఫేక్ అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇదే విషయాన్ని హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా చెప్పారు. ఇది ఆమెకు మెయిన్ మైనస్ అయ్యింది. ఇక కింగ్ నాగ్‌ను బిట్టూ అంటూ సంబోధించడం ఆయన ఫ్యాన్స్‌కు తీవ్ర చిరాకును తెప్పించింది. సూట్ అవ్వని సమయాల్లో ఆమె చేసిన హడావిడిపై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వచ్చాయి. ఇక గాసిప్పులకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నెటిజన్ల అభిప్రాయపడుతోన్న విషయం తెలిసిందే. ఈ కారణాల వల్ల వీక్షకులు ఆమెకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ నుంచి సూర్య కిరణ్, కరాటే కల్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ వరుసగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.