అదరగొట్టిన పాండే, వార్నర్.. రాయల్స్ టార్గెట్ 159
ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 159 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మనీష్ పాండే(54), వార్నర్(48) రాణించడంతో..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 159 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మనీష్ పాండే(54), వార్నర్(48) రాణించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి స్లోగానే సాగింది. ఆరంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. అంతేకాకుండా ఆదిలోనే హైదరాబాద్ ఓపెనర్ బెయిర్‌స్టో(16) వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే(54), కెప్టెన్ వార్నర్(48)తో కలిసి రెండు వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక చివర్లో విలియమ్సన్ ఎప్పటిలానే మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, త్యాగీ, ఉనద్కట్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read: