AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: కోట్లాది మంది ఈపీఎఫ్‌ఓ ​​సభ్యులకు గుడ్‌న్యూస్‌.. ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు!

EPFO: ఈపీఎఫ్ఓ మార్చి 6, 2025 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.16 కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చారిత్రాత్మక స్థాయిని సాధించింది. 2023-24లో ఇది రూ.89.52 లక్షలుగా ఉంది. క్లెయిమ్‌ల తిరస్కరణ రేటు కూడా గత సంవత్సరం 50 శాతం నుండి 30 శాతానికి తగ్గింది..

EPFO: కోట్లాది మంది ఈపీఎఫ్‌ఓ ​​సభ్యులకు గుడ్‌న్యూస్‌.. ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు!
Subhash Goud
|

Updated on: Mar 31, 2025 | 7:24 PM

Share

7.5 కోట్ల మంది సభ్యుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO​​) ముందస్తు క్లెయిమ్‌ల ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల మొత్తం 5 రెట్లు. మీడియా నివేదికల ప్రకారం.. గత వారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల ఎగ్జిక్యూటివ్ కమిటీ 113వ సమావేశంలో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమితా దావ్రా, ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచడానికి ఆమోదం తెలిపారు. ఈ సవరణ దాని కోట్లాది మంది సభ్యుల జీవితాలను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Airplane Toilet Waste: విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

5 లక్షల వరకు పీఎఫ్ డబ్బులు కూడా విత్‌డ్రా:

మార్చి 28న జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన ఈ సమావేశంలో EPFO ​​సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. CBT ఆమోదం పొందిన తర్వాత ఈపీఎఫ్‌వో ​​సభ్యులు ASSC ద్వారా రూ.5 లక్షల వరకు పీఎఫ్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఆటో సెటిల్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ మొదట 2020లో ప్రారంభించారు. ఆ సమయంలో దాని పరిమితి రూ. 50 వేలు. మే 2024లో, EPFO ​​అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1 లక్షకు పెంచింది.

ఇది కూడా చదవండి: Passport Color: షారుఖ్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఎందుకు ఉంది? భారత్‌లో ఎన్ని రకాల పాస్‌పోర్ట్‌లున్నాయి?

ఆటో మోడ్ సెటిల్మెంట్‌:

ఈపీఎఫ్‌వో విద్య, వివాహం, గృహనిర్మాణం అనే మరో 3 వర్గాలకు ముందస్తు క్లెయిమ్‌ల ఆటో మోడ్ పరిష్కారాన్ని కూడా ప్రవేశపెట్టింది. గతంలో సభ్యులు అనారోగ్యం, సుపత్రిలో చేరడం కోసం మాత్రమే తమ పీఎఫ్‌ను ఉపసంహరించుకోగలిగేవారు. అదే సమయంలో ఆటో-మోడ్ క్లెయిమ్‌లు కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు 95 శాతం క్లెయిమ్‌లు ఆటో సెటిల్ అయ్యాయి.

ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్:

ఈపీఎఫ్ఓ మార్చి 6, 2025 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.16 కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ చారిత్రాత్మక స్థాయిని సాధించింది. 2023-24లో ఇది రూ.89.52 లక్షలుగా ఉంది. క్లెయిమ్‌ల తిరస్కరణ రేటు కూడా గత సంవత్సరం 50 శాతం నుండి 30 శాతానికి తగ్గింది. అదే సమయంలో పీఎఫ్‌ ఉపసంహరణకు ధృవీకరణ ఫార్మాలిటీలను కూడా 27 నుండి 18కి తగ్గించారు. అలాగే దానిని 6కి తగ్గించాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: New Rules: యూపీఐ, ఆదాయపు పన్ను నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!

ఇది కూడా చదవండి: Mukesh Ambani House: అంబానీ ఇంటి విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే మతిపోతుంది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి