ఈ ఐదు అలవాట్లు మీ దృష్టిని బలహీనపరుస్తాయి.. ఈరోజే వాటికి గుడ్ బై చెప్పేయండి..
మారిన జీవన శైలి, అలవాట్లు వయసుతో సంబంధం లేకుండా వివిధ రకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అందులో ఒకటి కంటి చూపు తగ్గడం. ఈ రోజుల్లో చిన్న వయసులోనే కంటి చూపు మందగించడం, కంటికి సంబంధించిన సమస్యలు రావడం చాలా సాధారణం అయిపోయింది. దీనికి కారణం కళ్ళకు హాని కలిగించే కొన్ని రోజువారీ అలవాట్లు ఉన్నాయి. ఈ అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు

కళ్ళు మన శరీరంలోని అతి ముఖ్యమైన, సున్నితమైన అవయవాలలో ఒకటి. కళ్ళు మనల్ని మనకి మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడడానికి సహాయపడతాయి. కనుక కళ్ళను సంరక్షణకు ఎక్కువ శ్రద్ధ అవసరం. నేటి జీవనశైలి కారణంగా.., చిన్న వయసులోనే కంటి చూపు బలహీనపడటం ప్రారంభమవుతుంది. పొడిబారడం, అలసట, చికాకు, ఎరుపు, కళ్ళు నీరు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఇవి చిన్న చిన్న సమస్యలే అంటూ నిర్లక్ష్యం వద్దు.. ఈ సమస్యలను గుర్తించి జాగ్రత్తపడ పొతే కంటి చూపును బలహీనపడడమే కాదు.. గ్లాకోమా, కంటిశుక్లం, వర్ణాంధత్వం వంటి అనేక తీవ్రమైన కంటి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా మీ కంటి చూపును సరిగ్గా ఉంచుకోవచ్చు. అనేక సమస్యల నుంచి మీ కళ్ళను కాపాడుకోవచ్చు.
- కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి.. తరచుగా కళ్ళను తనిఖీ చేసుకోవడం ముఖ్యం. అంటే కళ్ళను రెగ్యులర్ గా చూపించుకోవాలి. ఇలా చేయడం వలన ఏదైనా కంటి సమస్య ఉంటే ముందుగానే గుర్తించవచ్చు. దీంతో పరిస్థితి తీవ్రమైనదిగా మారకుండా నివారించవచ్చు. అయితే ఇప్పటి జనరేషన్ అలవాట్లు కళ్ళకు ఏవిధంగా హాని కలిగిస్తాయో.. వాటిని ఎలా మెరుగుపరచాలో ఈ రోజు తెలుసుకుందాం..
- స్క్రీన్ చూసే సమయం: ప్రస్తుతం పిల్లలకు రోజు స్మార్ట్ ఫోన్ తోనే మొదలవుతుంది. స్మార్ట్ ఫోన్ తోనే రోజు ముగుస్తుంది. గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. కళ్ళపై కూడా ఇది చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కనుక పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. పనిలో మీరు కంప్యూటర్ ముందు గంటల తరబడి గడపవలసి వస్తే, ప్రతి ఇరవై నిమిషాలకు ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. కొంత దూరంలో ఉన్న ఏ వస్తువుని అయినా జాగ్రత్తగా చూస్తూ కళ్ళు రెప్పవేయండి. విశ్రాంతి తీసుకోవడానికి అరచేతులను మీ కళ్ళపై ఉంచండి.
- సన్ గ్లాసెస్ లేకుండా బయటకు వెళ్లవద్దు: సూర్యుని అతినీలలోహిత కిరణాలు చర్మానికే కాదు కళ్ళకు కూడా హాని కలిగిస్తాయి. చాలా మంది అద్దాలు లేకుండా ప్రకాశవంతమైన సూర్యకాంతిలో బయటకు వెళతారు, ఈ అలవాటు కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కనుక బయటకు వెళ్ళినప్పుడల్లా కళ్ళపై సూర్య కాంతి నేరుగా తాకకుండా ఉండటానికి సన్ గ్లాసెస్ ధరించండి లేదా గొడుగును తీసుకెళ్లండి.
- శరీరాన్ని సరిగ్గా హైడ్రేట్ గా ఉంచుకోండి: శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోకపోవడం వలన మొత్తం శరీరం దెబ్బతింటుంది. కళ్ళు పొడిబారతాయి. తక్కువ నీరు త్రాగే అలవాటు ఉంటే.. వెంటనే నీరు తాగడం మొదలు పెట్టండి. ఎక్కువ నీరు త్రాగలేకపోతే ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోండి. మజ్జిగ, నిమ్మకాయ నీరు, చెరకు రసం, సత్తు సిరప్, ఆపిల్ సిరప్, ఫెన్నెల్ సిరప్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు త్రాగాలి.
- సమతుల్య ఆహారం తీసుకోండి: మారిన అలవాట్లలో తినే ఆహారం కూడా ఒకటి. జంక్ ఫుడ్ తింటూ రోజూ తినే ఆహారంలో పోషకాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కళ్ళకు జింక్, విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు అవసరం. ఈ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినకపోతే.. దృష్టి దెబ్బతింటుంది. కనుక కళ్ళు ఆరోగ్యం కోసం క్యారెట్, చేపలు, గుడ్డు, వాల్‌నట్, బాదం, నారింజ, ద్రాక్ష, బ్లూబెర్రీ, బొప్పాయి వంటి ఆహారాలను సమతుల్య పద్ధతిలో ఆహారం తినాలి.
- రాత్రి త్వరగా నిద్రపోండి: ఆధునిక జీవనశైలి వల్ల ప్రజలు తరచుగా అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. ఈ అలవాటు కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు అనేక తీవ్రమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. కనుక రాత్రి కనీసం 10 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించాలి. రోజూ 7-8 గంటలు బాగా నిద్రపోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)