Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs CSK: వాటి వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం.. CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయిన CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఫీల్డింగ్ తప్పిదాలే తమ ఓటమికి కారణమని వెల్లడించాడు. నితీష్ రాణా అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, CSK ఫీల్డర్లు అతని పరుగులను కంట్రోల్ చేయలేకపోయారని అన్నాడు. ఛేజింగ్‌లో టాప్-ఆర్డర్ విఫలమవడం, స్ట్రాంగ్ ఫినిష్ లేకపోవడం CSKపై ప్రభావం చూపిందని గైక్వాడ్ పేర్కొన్నాడు. అయితే, బౌలింగ్ పాజిటివ్‌గా మారిందని, జట్టును మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.

RR vs CSK: వాటి వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం.. CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
Csk Vs Rr Ruturaj Gaikwad Riyan Parag
Follow us
Narsimha

|

Updated on: Mar 31, 2025 | 7:12 PM

నితీష్ రాణా అద్భుత బ్యాటింగ్, ఫీల్డింగ్ తప్పిదాలు, ఓపెనర్ల వైఫల్యం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటమికి కారణమయ్యాయని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో CSK 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది CSKకు వరుసగా రెండో ఓటమి, మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు ఈ సీజన్‌లో తొలి విజయం. మ్యాచ్ అనంతరం గైక్వాడ్ మాట్లాడుతూ “మైదానంలో మేము చురుగ్గా వ్యవహరించలేదు. ఓపెనర్లు మెరుగైన ఆరంభం అందిస్తేనే విజయాలు సాధించగలం” అని అభిప్రాయపడ్డాడు.

“పవర్‌ప్లే మా మ్యాచ్‌ను తారుమారు చేసింది. నితీష్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మేము అతన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాం. అతను బిహైండ్ స్క్వేర్ దిశగా ఎక్కువగా ఆడుతుండగా, మేము అతన్ని ఫ్రంట్ ఆఫ్ ది వికెట్ ఆడించేలా ఫీల్డింగ్ సెట్ చేయాల్సింది. ఫీల్డింగ్ తప్పిదాల వల్ల 8-10 పరుగులు అదనంగా ఇచ్చాం, ఇది చాలా ప్రభావం చూపింది. ఫీల్డింగ్ మెరుగుపర్చుకోవడానికి మేము కృషి చేస్తున్నాం.

182 పరుగుల లక్ష్యం చేధించదగినదే. మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మొదట 210 పరుగుల దిశగా దూసుకెళ్లిన RRను 182 పరుగులకు కట్టడి చేయడం పాజిటివ్ సైన్” అని గైక్వాడ్ వివరించాడు.

గతంలో CSK మిడిల్ ఓవర్లలో అజింక్యా రహానే, అంబటి రాయుడు కీలక పాత్ర పోషించేవారు. ఆ ఇద్దరూ లేరు కాబట్టి, నేను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావడమే సరైన నిర్ణయం అనిపించింది. త్రిపాఠి టాప్-ఆర్డర్‌లో దూకుడుగా ఆడతాడని భావించాం, కానీ ఇది పెద్ద సమస్య కాదని గైక్వాడ్ చెప్పాడు.

“ఇదివరకు మూడు మ్యాచుల్లో నేను ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చా. వేలంలో CSK మేనేజ్‌మెంట్ నాకు మూడో స్థానంలో ఆడాలని సూచించింది. నేను స్ట్రైక్ రొటేట్ చేయడంలో మంచి ప్రయోజనం ఉంది, అవసరమైనప్పుడు రిస్క్ తీసుకోవచ్చు” అని చెప్పాడు.

“దురదృష్టవశాత్తు మాకు సరైన శుభారంభాలు లభించడం లేదు. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం అందిస్తే, మా పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, మేము కొన్ని పాజిటివ్ అంశాలు గమనించాము. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, మా బౌలింగ్ యూనిట్‌కు స్ట్రాంగ్ మూమెంటమ్ రావాలి. ఒక్కసారి ఆ రితి వచ్చినట్లయితే, CSKను ఓడించడం చాలా కష్టం” అని గైక్వాడ్ స్పష్టం చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా (81 పరుగులు, 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

ఛేజింగ్ కి దిగిన CSK 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. రుతురాజ్ గైక్వాడ్ (63 పరుగులు, 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే నిలబడ్డాడు. రవీంద్ర జడేజా (34 నాటౌట్, 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ (16) పోరాడారు. వానిందు హసరంగా (4/35) CSK పతనాన్ని శాసించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..