కావ్య పాప కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ .. సైలెంట్ అయిపోయిన బ్యూటీ..
Rajeev
30 March 2025
Credit: Instagram
ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, హీరోయిన్స్ కు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది అందాల బీజమా కావ్య కళ్యాణ్ రామ్
కావ్య కళ్యాణ్ రామ్ 1998 జూలై 20న తెలంగాణలోని కొత్తగూడెంలో జన్మించింది.
కావ్య కళ్యాణ్ రామ్ 2003లో వచ్చిన "గంగోత్రి" చిత్రంతో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసింది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, కావ్య "వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా అనే పాటలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత "స్నేహమంటే ఇదేరా", "ఠాగూర్", "అడవి రాముడు", "విజయేంద్ర వర్మ", "బాలు", "బన్నీ", "సుభాష్ చంద్రబోస్", "పాండురంగడు" వంటి పలు చిత్రాల్లో బాలనటిగా నటించింది.
2022లో "మసూదా" అనే హర్రర్ చిత్రంతో కథానాయికగా తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
అదే సంవత్సరం, "బలగం" (2023) చిత్రంలో నటించింది, ఇది తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించింది.
బలగం తర్వాత ఉస్తాద్ అనే సినిమా చేసింది. ఈ సినిమా నిరాశపరిచింది. ఆతర్వాత మరోసినిమా చేయలేదు కావ్య.