అధిక బరువు అనేది ఆధునిక జీవనశైలిలో సాధారణ సమస్యగా మారింది. కానీ ఈ అధిక బరువు కేవలం రూపానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
అధిక బరువు లేదా తీవ్ర ఊబకాయం ఉన్నవారికి నిద్రలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అనే ప్రశ్న చాలామందిలో ఉద్భవిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
అధిక బరువు ఉన్నవారిలో స్లీప్ ఆప్నియా అనే సమస్య సర్వసాధారణం. ఇది నిద్రలో శ్వాస తాత్కాలికంగా ఆగిపోయే పరిస్థితి.
శరీరంలో, ముఖ్యంగా మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల శ్వాసనాళాలు ఇరుకైపోతాయి. దీనివల్ల గురక ఎక్కువగా వస్తుంది మరియు కొన్ని సందర్భాల్లో శ్వాస పూర్తిగా ఆగిపోతుంది.
తీవ్ర ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు.. నిద్రలో చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
గట్టిగా గురక పెట్టడం, శ్వాస ఆడకపోవడం వల్ల హఠాత్తుగా మేల్కొవడం, పగటిపూట నిద్రమత్తు లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
150 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నవాళ్లు ప్రాణాలను కోల్పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని ఇలాంటి వాళ్లు నిద్రలోనే మరణించే రిస్క్ ఎక్కువని వైద్యులు వెల్లడించారు.