వయసు పెరిగినా చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న స్నేహ
Phani CH
27 March 2025
Credit: Instagram
తెలుగు ప్రేక్షకులకు స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు.
ఈ ముద్దుగుమ్మ అక్టోబర్ 12, 1981, ముంబైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. ఈ చిన్నది ఇంగనే ఒరు నీల పక్షి అనే మలయాళ చిత్రంతో సినీరంగం లో కి అడుగు పెట్టింది.
స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తరువాత "సంక్రాంతి", "రాధాగోపాలం", "శ్రీరామదాసు" వంటి తెలుగు సినిమాలతో పాపులర్ అయ్యింది. రవితేజ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది.
ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ సౌందర్య లాంటి ఇమేజ్ సంపాదించింది. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది.
స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన s/o సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధయ రామ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసింది స్నేహ.
స్నేహ తమిళ్ లోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్, సూర్య, ప్రశాంత్, ధనుష్ లతో నటించింది.