ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు

అంతుచిక్కని వరుస మరణాలతో ఆ గ్రామం బిక్కుబిక్కుమంటుంది. కారణం తెలియకుండానే చనిపోతున్నవారిని చూసి ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు.

ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు
Follow us

|

Updated on: Oct 10, 2020 | 6:26 PM

అంతుచిక్కని వరుస మరణాలతో ఆ గ్రామం బిక్కుబిక్కుమంటుంది. కారణం తెలియకుండానే చనిపోతున్నవారిని చూసి ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందో అన్న భయం  వారిని వెంటాడుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో ఈ పరిస్థితులు నెలకున్నాయి. గ్రామంలో జ్వరాల వ్యాప్తి అధికంగా ఉంది. దీంతో ప్రజలు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంటే ఖమ్మం ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో కోవిడ్‌ మొబైల్‌ మెడికల్ టీమ్స్ టెస్టులు నిర్వహిస్తున్నా.. తమ గ్రామానికి ఎందుకు రావడంలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్ద పోచారంలో ప్రస్తుతం సంభవిస్తోన్న మరణాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు గ్రామంలో 12 మంది ప్రాణాలు విడిచారు. ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నా తమను ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )

మరణించిన వారిలో కోవిడ్ బారిన పడిన వారు‌, వృద్ధాప్యంలో ఉన్న వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి వరుసగా మరణాలు సంభవించడం, మరో వైపు జ్వరాల తీవ్రత పెరగడం..అది ఏ జ్వరమో.. ఎక్కడ చికిత్స చేయించుకోవాలి, మందులు ఎవరిస్తారు..జ్వరం అని చెబితే కరోనా అని తీసుకెళ్లిపోతారేమో అన్న అనుమానాలు, భయాలు ఆ ఊరిని ఆవరించాయి. దీంతో ప్రజలు జ్వరం వచ్చినా సొంత వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. ఆ గ్రామ ప్రజలకు కౌన్సిలంగ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )