AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ ఘటన: కుళ్లిన శవంతో కుటుంబీకుల సహవాసం

నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్న ఓ ఇంట్లో గత రెండు రోజలుగా శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది..ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల జనాలు ఇబ్బంది పడ్డారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా,

షాకింగ్ ఘటన: కుళ్లిన శవంతో కుటుంబీకుల సహవాసం
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2020 | 6:16 PM

Share

నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్న ఓ ఇంట్లో గత రెండు రోజలుగా శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది..ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల జనాలు ఇబ్బంది పడ్డారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా, ఆ ఇంటి బంధువులు ఒకరు వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. అది చూసిన స్థానికులు, పోలీసులు షాక్ తిన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో నివాసం ఉండే పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి ఇరుగుపొరుగు వారితో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. స్థానికులు కూడా ఎవరూ పట్టించుకోరు. పెద్ద కుటుంబం అయినా, బంధువులు ఎక్కువ మంది ఉన్నా వారిని ఇంటి పరిసరాలకు కూడా రానివ్వకుండా ఎప్పుడూ ఇంటికీ, గేటుకు తాళాలు వేసుకుని ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. నెలలో ఒకసారి, రెండు సార్లు మాత్రం సత్యనారాయణ పెన్షన్ డబ్బుల కోసం బయటకు వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు తెచ్చేవాడని అంటున్నారు.

ఈ క్రమంలో సత్యనారాయణ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో సత్యనారాయణ తమ్ముడి కొడుకు ఇంట్లోకి వెళ్లి చూశాడు. ఇంట్లో చనిపోయిన వ్యక్తి మంచంపై ఉందని గమనించి పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చాడు. ఆ ఇంటికి వెళ్లిన పోలీసులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి షాకయ్యారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు. ఇంట్లో ఉన్నవారిని వివరాలు అడిగినా సమాధానం చెప్పలేకపోయారు.. వారు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, సత్యనారాయణ ఇద్దరు పిల్లలు కూడా మతిస్థిమితం లేని వారు కావటంతో ఈశ్వరమ్మ ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి. అందువల్లే విషయాన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని అంటున్నారు. జరిగిన ఘటనతో స్థానికులు హడలెత్తిపోయారు. సత్యనారాయణ కుటుంబాన్ని ఏదైనా మానసిక వికాస కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.