AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలర్ట్.. వేసవిలో ఈ ఫుడ్స్ ని అస్సలు తినకండి..! ఆరోగ్యానికి మంచివి కావు.. ఎందుకంటే..?

వేసవిలో ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా నీరును కోల్పోతుంది. అందుకే చలువ కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ కాలంలో తినకపోవడం మంచిది. ఇప్పుడు వేసవిలో తినకూడని కొన్ని ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

అలర్ట్.. వేసవిలో ఈ ఫుడ్స్ ని అస్సలు తినకండి..! ఆరోగ్యానికి మంచివి కావు.. ఎందుకంటే..?
Avoid These Foods In Summer
Prashanthi V
|

Updated on: Apr 09, 2025 | 7:58 PM

Share

వేసవిలో ఎండలు బాగా పెరుగుతాయి. ఈ కాలంలో శరీరం త్వరగా నీరును కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి చల్లదనాన్ని కలిగించే పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు వేసవిలో తీసుకోవడం మంచిది కాదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెడ్ మీట్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వేసవిలో శరీరం వేడిగా ఉండే పరిస్థితిలో మటన్ వంటకాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రత మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేసవిలో వీటిని తగ్గించుకోవడం ఉత్తమం.

తీవ్రత ఎక్కువగా ఉండే మసాలా పదార్థాలు వేసవిలో తీసుకోవడం వల్ల చెమటగా మారిన నీరు శరీరం నుంచి త్వరగా బయటకు పోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. అందుకే ఈ కాలంలో తక్కువ మసాలాలతో తయారైన తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవాలి.

ఈ కాలంలో ఆయిల్‌లో వేయించిన బర్గర్లు, బజ్జీలు, పకోడి వంటి వంటకాలు శరీరాన్ని అధికంగా వేడెక్కించే అవకాశం ఉంది. ఇవి కొవ్వు ఎక్కువగా కలిగి ఉండి జీర్ణ సమస్యలు తెస్తాయి. వేసవిలో ఇవి తక్కువగా తినడం మంచిది.

వేసవిలో కొందరికి రోజూ వేడి టీ, కాఫీ తాగడం అలవాటు ఉంటుంది. కానీ ఈ డ్రింక్ లు వేసవిలో శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. వీటికి బదులుగా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళాంటి డ్రింక్ లను తీసుకోవాలి.

చిప్స్, పాప్కార్న్, పికిల్స్ లాంటి పదార్థాలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరం త్వరగా నీరును కోల్పోతుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. అందువల్ల వేసవిలో ఉప్పు తక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి.

టిన్నింగ్ చేసిన మాంసాహారాలు, సాసేజ్, సాలమీ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం శాతం ఎక్కువగా ఉంటుంది. సోడియం శరీరాన్ని నీరిలేకుండా చేసే విధంగా పని చేస్తుంది. దీనివల్ల వేసవిలో ఎక్కువ నీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

వేసవిలో శరీరానికి చలువ కలిగించే ఆహారాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్జూరం, ద్రాక్ష, తాటి ముంజలు, వాటర్‌మెలన్, కీరా, రాగి జావ, మజ్జిగ వంటి పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటివల్ల శరీరానికి తేమగా ఉంటుంది.. డీహైడ్రేషన్ జరగదు. వేడి వల్ల కలిగే అలసట, తలనొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

ఈ వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే ఆహారం విషయంలో తెలివిగా వ్యవహరించాలి. చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జీర్ణమయ్యేలా ఉండే తేలికపాటి ఆహారాలను తీసుకుంటే వేడి ప్రభావం తక్కువగా ఉంటుంది. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి ఫాలో అవ్వండి.

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా