Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ !

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హౌస్  నుంచి ఎలిమినేషన్‌లో లేని గంగవ్వ బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన ఎపిసోడ్ నేడు ప్రసారం అవ్వనుంది.

Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ !
Follow us

|

Updated on: Oct 10, 2020 | 4:36 PM

బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హౌస్  నుంచి ఎలిమినేషన్‌లో లేని గంగవ్వ బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన ఎపిసోడ్ నేడు ప్రసారం అవ్వనుంది. ఈ సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి అందింది. కాగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గంగవ్వ ఇంటిపై బాగా బెంగ పెట్టుకుంది. అన్నం కూడా  సరిగ్గా తినడం లేదు. రాత్రులు నిద్ర పట్టడం లేదని ఆమే తెలిపింది. ఇక హౌస్ సభ్యులు కూడా గంగవ్వను అడ్డుపెట్టుకోని సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనించిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను హౌస్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గంగవ్వ మొదట్లో చాలా బాగా గేమ్ ఆడింది. ఆ తర్వాత వయస్సు దృష్ట్యా టాస్కులలో పాలుపంచుకోలేకపోయింది. కాగా 60 ఏళ్ల వయస్సులో ఆమె ఈ స్థాయికి రావడం, ఇన్నాళ్లు హౌస్‌లో వినోదం పంచడం నిజంగా గొప్ప విషయం. ఎంతో మందికి ఆమె ఆదర్శం అని కూడా చెప్పాలి. బిగ్ బాస్ చరిత్రలో గంగవ్వకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిని నింపుతుంది.

Also Read : నిశ్శబ్దం.. అభిమానికి సారీ చెప్పిన మాధవన్‌

Latest Articles