AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: రూ. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి ఒరిజినలా, నకిలీనా.. ఇదిగో క్లారిటీ

ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉంటోంది. 500 రూపాయలతో పాటు ఇతర డినామినేషన్ల నోట్లపై కుడివైపు కింది భాగంలో ముద్రించి ఉండే సిరీస్ నంబర్ల మధ్యలో ఈ స్టార్ గుర్తు కనిపిస్తోంది. అలాంటి నోట్లు- నకిలీవనే ప్రచారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై జోరుగా సాగుతోంది. దీనిపై ఆర్బీఐ గతంలోనే క్లారిటీ ఇచ్చింది...

Fact Check: రూ. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి ఒరిజినలా, నకిలీనా.. ఇదిగో క్లారిటీ
500 Currency Note
Ram Naramaneni
|

Updated on: May 02, 2024 | 4:26 PM

Share

500 రూపాయల నోటుపై ఇప్పటికీ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఫేక్ కరెన్సీ విసృతంగా సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో.. స్టార్ గుర్తు ఉన్న 500 కరెన్సీ నోట్లను తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తున్నారు.  ఆ నోట్లు మార్కెట్‌లో చెల్లవంటూ.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు కనిపిస్తున్నారు. ఈ పుకార్లపై గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు ఫేక్ కావని వెల్లడించింది. ప్రింటింగ్ లోపం ఉన్న నోట్ల ప్లేసులో వీటిని ముద్రించినట్లు RBI తెలిపింది. 1 నుంచి 100 వరకు ఉండే సీరియల్ నంబర్ నోట్లలో ప్రింటింగ్ ఇబ్బందులు తలెత్తితే..  ఉన్న వాటి ప్లేసులో ఈ స్టార్ గుర్తున్న నోట్లను ముద్రించినట్లు వెల్లడించింది. అంటే..  స్టార్ సింబల్ ఉంటే- ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని RBI  సూచించింది. 500 నోటుపై సీరియల్ నంబర్‌కి ముందు స్టార్ గుర్తు ఉన్నవి మార్కెట్‌లో బేషుగ్గా చలామణి అవుతాయని తెలిపింది. స్టార్ సింబల్ ఉంటే మరొక నోటు ప్లేసులో ఈ నోటు ముద్రించినట్లు అర్థమని తేల్చి చెప్పింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది.

మొత్తంగా  లోపభూయిష్టంగా ఉన్న నోట్లను సరిచేసి, వాటిని మళ్లీ రీప్రింట్ చేయాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఈ స్టార్‌ గుర్తును నంబరింగ్ ప్యానెల్‌లో జత చేయాల్సి వచ్చిందని RBI తెలిసిన సారాశం. సో.. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు మీ వద్దకు వస్తే కంగారు పడకండి. అవి చెల్లుబాటులో ఉన్నట్లే లెక్క.

రూ.10 నాణెంపై కూడా క్లారిటీ…. 

అంతే రూ. 10 నాణెం చెల్లుబాటు కాదని కొందరు వాటిని తీసుకోవడం లేదు. రూ.10 నాణం చెల్లుతుందని ఆర్‌బీఐ పదే, పదే చెబుతూనే ఉంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, మెట్రో స్టేషన్లు వంటి చోట్ల వాటిని స్వీకరిస్తునే ఉన్నారు. కొందరికి అవగాహన లేక మాత్రమే వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని..
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో మార్పులు..?
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో మార్పులు..?
తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా..
తెలంగాణ శకుంతల చనిపోయే ముందు చెప్పింది విని ఏడ్చేశా..