Viral Video: పాము కాటుతో యువకుడు మృతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలిస్తే షాక్

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహిత్ పొలాల్లోకి వెళ్లగా అక్కడ పాము కాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు మృతదేహాన్ని గంగా జలంలో ఉంచితే.. శరీరం నుంచి పాము విషం పోతుందని.. అతడు తిరిగి జీవం పోసుకుంటాడని చెప్పారు. దీంతొ...

Viral Video: పాము కాటుతో యువకుడు మృతి.. కుటుంబ సభ్యులు ఏం చేశారో తెలిస్తే షాక్
Snake Bite Death
Follow us

|

Updated on: May 02, 2024 | 5:21 PM

స్పేస్‌లో దూసుకుపోతున్నాం… టెక్నాలజీ విషయంలో రాక్ చేస్తున్నాం. అయినా కొందరి నుంచి ఈ మూఢనమ్మకాలను మాత్రం వేరు చేయలేకపోతున్నాం. తాజాగా.. యూపీలోని బులంద్‌షహర్‌లో పాము కాటుకు గురై మృతి చెందిన ఓ యువకుడిని బతికించాలనే ఆశతో.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతడి మృతదేహాన్ని తాడుతో కట్టి గంగాజలంలో వేలాడదీసిన షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చాలాసేపు అలా ఉంచిన తర్వాత ఆ యువకుడిలో చలనం రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మూఢ నమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియజెప్పే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అందిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 26 న, 20 ఏళ్ల మోహిత్ పాము కాటు కారణంగా మరణించాడు. అతని మృతి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. ఇంతలో ఎవరో మృతుడి శరీరాన్ని గంగా నదిలో ముంచినట్లయితే.. పాము విష ప్రభావం తొలగిపోయి.. తిరిగి ప్రాణం పోసుకుంటాడని సలహా ఇచ్చారు.  ఆ మాటలు నమ్మిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మోహిత్ మృతదేహంతో గంగానది ఒడ్డున ఉన్న వంతెన దగ్గరకు చేరుకున్నారు. మోహిత్ మృతదేహాన్ని తాడుతో కట్టి గంగలో వేలాడదీశారు. బలమైన అలల మధ్య చాలా సేపు మృతదేహాన్ని నీటిలోనే ఉంచారు. నిజంగానే అద్భుంత జరిగి అతడు బతుకుతాడని..  చుట్టూ వందలాది మంది గుమిగూడారు. కానీ ఎంత సమయం గడిచినా మోహిత్‌లో చలనం రాకపోవడంతో… కుటుంబ సభ్యులు ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ మొత్తం సంఘటన అహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైరాంపూర్ కుడైన గ్రామంలో జరిగినట్లు తెలిసింది.

మరిన్నిజాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.