Get Rid of Prickly Heat: చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..

వేసవిలో ఇబ్బంది పెట్టే సమస్యల్లో చెమట కాయలు కూడా ఒకటి. చెమట కాయలు వస్తే మంటగా, దురదగా అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా, చిరాకుగా ఉంటుంది. వేసవిలో ఎండ కన్నా.. ఈ చెమట కాయలకే జనం భయపడి పోతూ ఉంటారు. అందులోనూ చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. తేమతో కూడిన వాతావరణంలో నివసించే వారు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. శరీరంపై ఉండే శ్వేద గ్రంథులు మూసుకుపోతే..

Get Rid of Prickly Heat: చెమట కాయలతో చిరాకు వస్తుందా.. ఇలా చేస్తే రిలీఫ్ దొరుకుతుంది..
Get Rid Of Prickly Heat
Follow us

|

Updated on: May 02, 2024 | 4:28 PM

వేసవిలో ఇబ్బంది పెట్టే సమస్యల్లో చెమట కాయలు కూడా ఒకటి. చెమట కాయలు వస్తే మంటగా, దురదగా అనిపిస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా, చిరాకుగా ఉంటుంది. వేసవిలో ఎండ కన్నా.. ఈ చెమట కాయలకే జనం భయపడి పోతూ ఉంటారు. అందులోనూ చిన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉంటారు. తేమతో కూడిన వాతావరణంలో నివసించే వారు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. శరీరంపై ఉండే శ్వేద గ్రంథులు మూసుకుపోతే.. చెమట పొక్కుల్లా మారి ఉండి పోతుంది. మరి ఈ చెమట కాయలను ఎలా తగ్గించాలి? ఏం చేస్తే వీటి నుంచి ఉపశమనం లభిస్తుందన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చెమట కాయలను తగ్గించుకునేందుకు పరిష్కారాలు:

చల్లటి వాతావరణంలో ఉండండి:

శరీరానికి ఎక్కువగా చెమట పడితేనే.. చెమట కాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెమట పట్టకుండా చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించండి.

చన్నీటి స్నానం మేలు:

చెమట కాయలను తగ్గించుకోవాలంటే.. చన్నీటితో స్నానం చేయాలి. రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు చేసినా పర్వాలేదు. దీంతో శరీరం చల్లబడుతుంది. దీంతో చెమట కాయలు తగ్గుతాయి. అయితే స్నానం చేసేటప్పుడు సబ్బును తక్కువగా ఉపయోగించాలి.

ఇవి కూడా చదవండి

కాటన్ దుస్తులు ధరించండి:

ఎండ నుంచి చెమట కాయల నుంచి ఉపశమనం పొందాలంటే పలుచని కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. దీని వల్ల చెమట కాయలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఇవి ఉపయోగించండి:

చెమట కాయల్ని తగ్గించుకోవాలంటే.. క్యాలమిన్ లోషన్ లేదా జింక్ ఆక్సైడ్ ఉపయోగించండి. చెమట కాయలు తగ్గేందుకు ట్రోపికల్ కార్టికో స్టెరాయిడ్స్ లేదా ట్రోపికల్ యాంటీ బయోటిక్స్ కూడా చెమట కాయల్ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి.

కర్పూరం – కొబ్బరి నూనె:

చెమట ఎక్కువగా పట్టకుండా ఉండాలన్నా.. చెమట కాయలు తగ్గాలన్నా.. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి శరీరం అంతా మర్దాన చేయండి. ఇలా చేయడం వల్ల వేడి, చెమట కాయల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వేపాకుల స్నానం:

వేప ఆకుల్ని నీటిలో బాగా మరిగించి.. వాటిని నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల చెమట కాయల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలోవెరా జెల్:

అదే విధంగా చెమట కాయల నుంచి ఉపశమనం పొందాలంటే.. కలబందను తరచూ రాస్తూ ఉండండి. ఇలా చేస్తే.. చెమట కాయల నుంచి రిలీఫ్ పొందుతారు.

NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles