Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ యోగాసనాన్ని ట్రై చేసి చూడండి

ఈరోజు ఒత్తిడిని తగ్గించే సులభమైన యోగాసనం గురించి తెలుసుకుందాం.. దీని పేరు విపరీత కరణి యోగాసనం. ఈ యోగా ఆసనం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇలా చేస్తే బాగా నిద్రపోవడంతోపాటు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. యోగా నిపుణుడు సుగంధ గోయల్ చెప్పినట్లు విపరీత కరణి యోగాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ యోగాసనాన్ని ట్రై చేసి చూడండి
Legs Up The Wall Pose
Follow us
Surya Kala

|

Updated on: May 16, 2024 | 7:20 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అనేక పరిస్థితులు, విషయాల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి మానసిక, శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాదు వ్యక్తిత్వంపై కూడా ప్రభావితం చూపిస్తుంది. దీని వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఒత్తిడిని నియంత్రించడం చాలా ముఖ్యం. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు, శరీరం కార్టిసాల్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది, దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. ఇది నిజమైన లేదా ఊహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి లేదా నివారించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అయితే కార్టిసాల్ స్థాయిలు ఎక్కువ కాలం పాటు ఎక్కువగా ఉంటే.. అది బరువు పెరగడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, నిరాశ వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

ఎవరైనా మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు.. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. రక్తపోటు స్థాయి కూడా పెరుగుతుంది. శరీరం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉంటుంది. భయం పోయినప్పుడు, సురక్షితంగా భావించడం ప్రారంభించినప్పుడు.. ఒత్తిడి తగ్గకపోతే అప్పుడు ప్రతిచర్య కొనసాగుతుంది. ఎవరైనా ఎటువంటి కారణం లేకుండా పదే పదే ఒత్తిడికి గురవుతుంటే.. దీనితో పాటు ఇతర సమస్యలను కలిగి ఉంటే అది శరీరానికి హానికరం.

ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఎక్కువగా ధ్యానం చేయడం మంచిది. అయితే చాలా మందికి ధ్యానం చేయడంలో ఇబ్బంది ఉంటుంది. లేదా ఒకే చోట ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు. అటువంటి పరిస్థితిలో యోగాని ఆశ్రయించవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈరోజు ఒత్తిడిని తగ్గించే సులభమైన యోగాసనం గురించి తెలుసుకుందాం.. దీని పేరు విపరీత కరణి యోగాసనం.

ఇవి కూడా చదవండి

ఈ యోగా ఆసనం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఇలా చేస్తే బాగా నిద్రపోవడంతోపాటు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. యోగా నిపుణుడు సుగంధ గోయల్ చెప్పినట్లు విపరీత కరణి యోగాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం.

విపరీత కర్ణి యోగాసనం ఎలా చేయాలంటే

విపరీత కరణి యోగాసనం చేయడానికి గోడకు అభిముఖంగా కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ వీపుపై పడుకుని.. మీ రెండు కాళ్లను ఎత్తి.. గోడపై చాపండి. తుంటిని గోడకు దగ్గరగా ఉంచండి. మీ వీపును నేలపై లేదా చాపపై నేరుగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీ రెండు చేతులను చాపండి. ఇప్పుడు మీ అరచేతులను నెత్తి మీదకు ఉంచండి. మద్దతు కోసం నడుము లేదా తుంటి కింద ఒక దిండును కూడా ఉంచుకోవచ్చు. ఈ ముద్ర 5 నిమిషాలు లేదా మీ సౌలభ్యం ప్రకారం చేయండి. సులభమైన యోగాసనం చేయడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోవడం మంచిది. ఖాళీ కడుపుతో లేదా ఆహారం తిన్న రెండు మూడు గంటల తర్వాత ఈ ఆసనాన్ని చేయండి.

ఎవరు ఈ ఆసనాన్ని చేయకూదదంటే..

రాత్రి నిద్రపోయే ముందు కొంత సమయం హాయిగా ఈ ఆసనాన్ని చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సులభం. అయితే రక్తపోటు ఎక్కువ లేదా తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. అలాగే వీపు లేదా మెడ సంబంధిత సమస్య లేదా కంటిశుక్లం ఉన్నవారు కూడా ఈ ఆసనం చేయకుండా ఉండాలి లేదా నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలు ఈ ఆసనం వేయకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..