ఈ ఆంధ్ర స్వీట్లు తింటే.. ఆహా ఏమి రుచి అని పాట పడాల్సిందే..
TV9 Telugu
16 May 2024
ఆంధ్ర అనగానే అందరికి మొదటిగా గుర్తు వచ్చే స్వీట్ పూతరేకులు. గోదావరి తీరి గ్రామమైన ఆత్రేయపురం రుచికరమైన పూతరేకులకు ఫేమస్.
తర్వాత స్థానంలో మాత్రం కాకినాడ గొట్టం కాజా ఉంటుంది. కాకినాడలో విరివిగా దొరికే ఈ కాజా కచ్చితంగా టేస్ట్ చూడాలి.
తాపేశ్వరం మడత కాజా ఒక్కసారి తిండి అస్సలు వదలరు. అనేక ప్రాంతాల్లో దొరికే కాజాల రుచులో దీని రుచే వేరయా.
బందర్ లడ్డు బందర్ అని కూడా పిలువబడే ఓడరేవు నగరమైన మచిలీపట్నంలో ఉంది. బేసన్, చక్కెర, నెయ్యి, గింజలతో తయారు చేస్తారు.
ఎక్కువగా కోస్తా జిల్లాల ప్రజలు పండగ సమయంలో చేసుకొనే పాల తెగలు లేదా పాల పూరి ఒక్కసారైన టెస్ట్ చెయ్యాలి.
బొబ్బట్లు ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన స్వీట్. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దీనిని పురాన్ పోలి అని కూడా పిలుస్తారు.
అరిసెలు ఆంధ్రలో మరో ఫేమస్ స్వీట్. బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేస్తారు. ప్రతి శుభకార్యంలో ఇవి తప్పనిసరి.
మాల్పురి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ప్రసిద్ధి చెందింది.ఈ స్వీట్ మైదా, చక్కెర, కొబ్బరి పాలతో తయారు చేస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి