నీతా అంబానీ భవనం, నగలు, బ్యాగ్ అత్యంత విలువైనవే.. మొత్తం ఆస్థి విలువ ఎంతో తెలిస్తే షాక్ ..

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నీతా ముకేశ్ అంబానీల ముద్దుల తనయ ఈషా అంబానీ.. జన్మతః అపర కుబేరురాలు. స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే పూర్తి చేసిన నీతా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. యేల్ యూనినవర్సిటీ నుంచి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో డిగ్రీ పట్టా తీసుకున్న నీతా ఎంబీఏ పట్టాను స్టాండ్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అందుకుంది. తర్వాత స్వదేశానికి వచ్చి తల్లిదండ్రుల బాటలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

నీతా అంబానీ భవనం, నగలు, బ్యాగ్ అత్యంత విలువైనవే.. మొత్తం ఆస్థి విలువ ఎంతో తెలిస్తే షాక్ ..
Isha Ambani
Follow us

|

Updated on: May 16, 2024 | 8:01 PM

కూర్చొంటే కోట్లు.. నిల్చుంటే కోట్లు.. నడిస్తే కోటానుకోట్లు. అసలు ఆమె జీవితమే కోట్లమయం. వయసు తక్కువ.. కానీ సంపాదన మాత్రం చాలా ఎక్కువ. ఏటా 4.5 కోట్ల రూపాయిల జీతం తీసుకునే ఆమె ఎవరో తెలుసా? ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ఏకైక ముద్దుల కుమార్తె.. ఈషా అంబానీ. ఈమె ఇంటి ఖరీదు ఎంతో తెలుసా.. రూ.450 కోట్లు. ఈమె పెట్టుకునే నెక్లెస్ రేట్ ఎంతో తెలుసా? రూ.165 కోట్లు. హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఎందుకంటే దాని ధర రూ.31 లక్షలు. దీనిని బట్టి ఆమె లైఫ్ స్టైల్ ఎంత లగ్జరీగా ఉంటుందో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నీతా ముకేశ్ అంబానీల ముద్దుల తనయ ఈషా అంబానీ.. జన్మతః అపర కుబేరురాలు. స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లోనే పూర్తి చేసిన నీతా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. యేల్ యూనినవర్సిటీ నుంచి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో డిగ్రీ పట్టా తీసుకున్న నీతా ఎంబీఏ పట్టాను స్టాండ్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అందుకుంది. తర్వాత స్వదేశానికి వచ్చి తల్లిదండ్రుల బాటలో వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

23 ఏళ్లకే రిలయన్స్ జియో మరియూ రిలయన్స్ రిటైల్ లో కీలక ఎగ్జిక్యూటివ్ గా పదవిని చేపట్టిన నీతా సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. ఏడాదికి రూ. 4.5 వేతనం అందుకుంటోంది. 2014లో రిలయన్స్ రిటైల్, రిలయన్ జీయోలో బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది. అంతేకాదు ప్రస్తుతం తండ్రి ముకేష్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించే పనిలో బిజీబిజీగా ఉంది. రిలయన్స్ రిటైల్ ఓవర్సీస్ కార్యకలాపాలనూ విస్తరించే పనిలో ఉంది.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే కాదు.. సంపన్న కుటుంబంలో అడుగు పెట్టిన ఈషా ఆంబానీ ఆస్తులకు కొదవేం లేదు. ఈషా అంబానీ ఆనంద్ పిరామల్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కృష్ణ, ఆదియా అనే ఇద్దరు కవల పిల్లలు. నీతా భర్త ఆనంద్ పిరామల్.. పిరామల్ గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్నారు. నీతా అంబానీ సొంత ఆస్తి విలువ రూ. 835 కోట్లుగా తెలుస్తోంది.

రూ. 450 కోట్ల బంగళా

ఈషా అంబానీ, ఆనందర్ పిరామల్ దంపతులు ముంబై వోర్లీలో సముద్రం ఎదురుగా అత్యంత ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. రాచరికాన్ని గుర్తు తెచ్చే విధంగా ఉండే ఈ భవనం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని పేరు గులిటా. ఈ బంగాళాను నీతా అంబానీ అత్తగారు అజయ్ పిరామల్, స్వాతి పిరామల్ పెళ్లి కానుకగా ఇచ్చారు. ఈ భవనాన్ని లండన్ కు చెందిన ఆర్కిటెక్ సంస్థ ఇకర్స్ లీ ఓ కాలగన్ దీన్ని డిజైన్ చేసింది. అప్పట్లో దీని విలువ రూ. 452 కోట్లు. అయితే ప్రస్తుతం ఈ భవనం మార్కెట్ ధర రూ. 1,000 కోట్లు అని తెలుస్తోంది.

ఈషా నగలు విలువ ఎంత అంటే..

ఈషా ఇంబానీ ప్రత్యేకంగా తయారు చేసిన డైమండ్ నక్లెస్ ను ధరిస్తారు. దీని విలువ రూ. 165 కోట్లు అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ధరించే హర్మీస్ మిని కెల్లీ హ్యాండ్ బ్యాగ్ విలువ కూడా రూ. 31 లక్షలు. ఇక నీతా వద్ద ఛానెల్ డాల్ బ్యాగ్ కూడా ఉంది. 2023లో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో ఈ బ్యాగ్ తోనే కన్పించింది. దీని విలువ రూ. 24 లక్షలు. అంతేకాదు నీతా దగ్గర రూ. 10 కోట్ల ఖరీదైన కారుతో సహా అనేక విలువైన కార్లు ఉన్నాయి. మరి అపర కుబేరురాలైన కుమార్తె వైభవం అంటే ఆమాత్రం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వానొస్తే మృత్యు పిలుపే అనే మరకపోయేదీ ఇంకెప్పుడు?
వానొస్తే మృత్యు పిలుపే అనే మరకపోయేదీ ఇంకెప్పుడు?
వాహ్! ఏం టాలెంట్‌ గురూ.. డ్రైవింగ్‌ కళ మామూలుగా లేదుగా.. వీడియో
వాహ్! ఏం టాలెంట్‌ గురూ.. డ్రైవింగ్‌ కళ మామూలుగా లేదుగా.. వీడియో
ప్రభాస్ బుజ్జి పై ఆనంద్ మహీంద్ర ట్వీట్..
ప్రభాస్ బుజ్జి పై ఆనంద్ మహీంద్ర ట్వీట్..
అమెరికా రోడ్డు ప్రమాదలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం
అమెరికా రోడ్డు ప్రమాదలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం
ప్రియురాలి పెళ్ళికి వచ్చిన ప్రియుడు.. స్టేజిపైనే ఎం చేసాడంటే.?
ప్రియురాలి పెళ్ళికి వచ్చిన ప్రియుడు.. స్టేజిపైనే ఎం చేసాడంటే.?
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే చాలు..పట్టులాంటి మెరిసే జుట్టు
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే చాలు..పట్టులాంటి మెరిసే జుట్టు
ఢిల్లీలో తెలుగువాళ్లు ఏ పార్టీకి చెయ్యెత్తి జై కొడతారో..!
ఢిల్లీలో తెలుగువాళ్లు ఏ పార్టీకి చెయ్యెత్తి జై కొడతారో..!
దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్.. ఉత్తరాదిలో సూర్యుడి భగభగలు..
దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్.. ఉత్తరాదిలో సూర్యుడి భగభగలు..
బాయ్‏ఫ్రెండ్‍తో బ్రేకప్.. శ్రుతిహాసన్ రియాక్షన్ ఇదే..
బాయ్‏ఫ్రెండ్‍తో బ్రేకప్.. శ్రుతిహాసన్ రియాక్షన్ ఇదే..
ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఇంటర్‌లో 25% వెయిటేజీ
ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఇంటర్‌లో 25% వెయిటేజీ