India T20 World Cup: టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే.!
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది.
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. గ్రూప్ -A లో ఉన్న భారత్-పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి. ఈ పొట్టికప్పు సిరీస్‌లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్‌లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరుగుతుంది.
రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ ప్రపంచకప్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పంత్ 2022 డిసెంబరు చివర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్‌తో పునరాగమనం చేసిన అతడు ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌లో పంత్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అదరగొడుతున్నాడు. దీంతో అతడిని సెలెక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్‌నకు సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2024లో చాహల్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.