ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటే..

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విచిత్ర సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వానరంపై గ్రామస్తులు మమకారాన్నిచాటారు. అచ్చం ఇంటి మనిషి చనిపోతే ఎలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో అదే తరహాలో కాలనీవాసులు అంత్యక్రియలు జరిపించారు. ఈ గ్రామస్తుల ఔదార్యం చూసి ప్రతి ఒక్కరూ నివ్వేర పోయారు. అనారోగ్యంతో ఓ వానరం మృతి చెందింది. ఈ క్రమంలో ఆ వానరం పై మానవత్వం ప్రదర్శించిన గ్రామస్తులు మనిషి చనిపోతే ఏవిధంగా అంతిమ సంస్కరణలు చేస్తారో అదే తరహాలో వానరానికి దహన సంస్కారాలు చేపట్టారు.

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. అంత్యక్రియలు ఎలా నిర్వహించారంటే..

| Edited By: Srikar T

Updated on: May 02, 2024 | 4:23 PM

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో విచిత్ర సంఘటన జరిగింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వానరంపై గ్రామస్తులు మమకారాన్నిచాటారు. అచ్చం ఇంటి మనిషి చనిపోతే ఎలా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో అదే తరహాలో కాలనీవాసులు అంత్యక్రియలు జరిపించారు. ఈ గ్రామస్తుల ఔదార్యం చూసి ప్రతి ఒక్కరూ నివ్వేర పోయారు. అనారోగ్యంతో ఓ వానరం మృతి చెందింది. ఈ క్రమంలో ఆ వానరం పై మానవత్వం ప్రదర్శించిన గ్రామస్తులు మనిషి చనిపోతే ఏవిధంగా అంతిమ సంస్కరణలు చేస్తారో అదే తరహాలో వానరానికి దహన సంస్కారాలు చేపట్టారు. ముందుగా స్నానం చేయించి పాడె కట్టిఅంతిమ యాత్ర నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరించారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య గ్రామంలోని పురవీధుల్లో అంతిమయాత్రగా తీసుకెళ్లి గ్రామ శివారులో దాహన సంస్కరాలు చేశారు. వానరం అంతిమ యాత్రలో ఊరంతా పాల్గొన్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించి వారి ఔదార్యాన్ని చాటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us