AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: ఇదెక్కడి మాస్ రా మావ.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..

కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలానే భారీ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తారక్ తో సినిమా చేయనున్నాడు. ఈ కాంబో గురించి చాలా ఏళ్ల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటి వరకు సినిమా పనులు ప్రారంభం కాలేదు. ఇద్దరూ వేర్వేరు సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్ర శాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

Jr NTR: ఇదెక్కడి మాస్ రా మావ.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్..
Ntr , Prashanth Neel
Rajeev Rayala
|

Updated on: May 17, 2024 | 8:50 AM

Share

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలానే భారీ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తారక్ తో సినిమా చేయనున్నాడు. ఈ కాంబో గురించి చాలా ఏళ్ల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటి వరకు సినిమా పనులు ప్రారంభం కాలేదు. ఇద్దరూ వేర్వేరు సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్ర శాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, ‘వార్2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘దేవర’ పాటను విడుదల చేయనున్నారు. ‘వార్ 2’ వైపు నుంచి పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. అదే విధంగా ప్రశాంత్ నీల్ తో సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తుంది. డ్రాగన్ అంటే పవర్ ఫుల్ టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది.

‘దేవర’, ‘వార్ 2’ చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీ కానున్నాడు. ‘సలార్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాల్షీట్ కోసం ప్రశాంత్ నీల్ ఎదురుచూస్తున్నాడు. ఈలోగా టైటిల్ విషయం చర్చకు వచ్చింది. ‘డ్రాగన్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ ఫైనల్‌ చేశారని తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మొదట్లోనే సినిమా షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us