కోహ్లీ, సచిన్, ధోనీ కాదు.. రూ.1450 కోట్లకు అధిపతి ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరో తెలుసా?
Ajay Jadeja Net Worth: టీమిండియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్లు అనగానే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ పేర్లే గుర్తుకొస్తాయి. కానీ వీరందరినీ మించిన సంపన్నుడు మరొకరు ఉన్నారు. అతడి ఆస్తి విలువ ఏకంగా రూ.1450 కోట్లు. ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే.

Ajay Jadeja Net Worth: భారత క్రికెట్‌లో డబ్బు, గ్లామర్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీవే. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, కోట్లాది రూపాయల బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో వీరు రాజసానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అయితే, క్రికెట్ ద్వారా సంపాదించిన దానికంటే వారసత్వంగా వచ్చిన రాజరికపు సంపదతో వీరందరినీ వెనక్కి నెట్టిన భారత మాజీ క్రికెటర్ ఒకరు ఉన్నారు. అతడే అజయ్ జడేజా.
రాజ వంశానికి వారసుడు..
1971 ఫిబ్రవరి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించిన అజయ్ జడేజా 1990వ దశకంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ బ్యాటర్. మైదానంలో చురుకైన ఫీల్డింగ్, ఆకర్షణీయమైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన జడేజా.. నవానగర్ రాజవంశానికి చెందిన వాడు.
ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?
2024 అక్టోబర్ 12న ఆయన జీవితంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జామ్‌నగర్ మహారాజా శత్రుసాల్యసిన్హజీ దౌలత్‌సిన్హజీ.. అజయ్ జడేజాను జామ్‌నగర్ రాయల్ థ్రోన్‌కు వారసుడిగా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆయన రూ.1,450 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు అధిపతి అయ్యాడు.
కోహ్లీ, ధోనీని దాటేశాడు.. సచిన్‌కు పోటీ..
ప్రస్తుత అంచనాల ప్రకారం, కింగ్ కోహ్లీ నికర సంపద దాదాపు రూ.1,000 కోట్లుగా ఉంది. 2026 నాటికి ఎంఎస్ ధోనీ సంపద రూ.1,060 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల మధ్య ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సచిన్ టెండూల్కర్ సంపద రూ.1,400 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మధ్య ఉంది. అంటే, సంపద పరంగా అజయ్ జడేజా కోహ్లీ, ధోనీలను అధిగమించి, సచిన్‌తో సమానంగా భారత క్రికెట్‌లోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు.
ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!
కోహ్లీ, ధోనీ, సచిన్ సంపద మొత్తం క్రికెట్, వ్యాపారాలు, ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చింది. కానీ జడేజా సంపదలో అత్యధిక భాగం రాజకుటుంబ వారసత్వం, ప్యాలెస్‌లు, విలువైన భూములు, పూర్వీకుల ఆస్తుల రూపంలోనిదే కావడం విశేషం.
8 ఏళ్లపాటు టీమిండియాకు సేవ..
అజయ్ జడేజా 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 2000 వరకు దాదాపు 8 ఏళ్లపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 15 టెస్టులు ఆడి 24 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు చేశాడు. 196 వన్డేల్లో 5,359 పరుగులు సాధించారు. వన్డేల్లో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా 1996 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆయన ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.
మైదానంలో కెరీర్ ముగిసిన రెండు దశాబ్దాల తర్వాత.. రాజసింహాసనం అధిష్టించి కోట్లకు పడగలెత్తిన అజయ్ జడేజా కథ నిజంగా సినిమాను తలపిస్తోంది. క్రికెట్‌తో సంపాదించలేని స్థాయిని వారసత్వం ఆయనకు అందించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




