దీపావళి అంటే దీపాల పండుగే అనుకుంటున్నారా? ఈ ఊళ్లో మాత్రం పేడతో సంబరాలు!
దీపావళి పండుగ అంటే దీపాల వెలుగులు, టపాసుల మోతలు, స్వీట్లు, పిండి వంటలు గుర్తుకొస్తాయి. కానీ కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళి సందర్భంగా వింతైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకుంటూ వినూత్నంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

దీపావళి అంటే దీపాల పండుగే అనుకుంటున్నారా? ఈ ఊళ్లో మాత్రం పేడతో సంబరాలు!
ఒకరిపై ఒకరు పేడ విసురుకుంటూ సంబరాలు.. అసలు కథ ఇదే!
కర్ణాటక: దీపావళి పండుగ అంటే దీపాల వెలుగులు, టపాసుల మోతలు, స్వీట్లు, పిండి వంటలు గుర్తుకొస్తాయి. కానీ కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళి సందర్భంగా వింతైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకుంటూ వినూత్నంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉన్న కె.ఆర్. పేట తాలూకా ససలు గ్రామంలో ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. మంగళవారం (నవంబర్ 10) సాయంత్రం గ్రామంలోని సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ వేడుక ప్రారంభమైంది. గ్రామస్థులు రెండు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఇలా పేడను విసురుకుంటూ వేడుక జరుపుకోవడాన్ని స్థానికంగా పేడ ఓకుళి అని పిలుస్తారు.
పేడ పండుగ వెనుక ఆసక్తికరమైన పురాణ కథ!
ఈ ప్రత్యేక ఆచారం వెనుక ఓ పురాణ గాథ ఉందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో కొలువైన సోమేశ్వర స్వామి, ఆయన భక్తుడైన భైరవరాజు మధ్య ఒకప్పుడు యుద్ధం జరిగిందని స్థానికుల విశ్వాసం. ఆ యుద్ధంలో సోమేశ్వర స్వామి ఓడిపోవడంతో ఒప్పందం ప్రకారం గుండు చేయించుకుని గాడిదపై ఊరేగింపుగా వెళ్లారని కథనం. ఈ పురాణ గాథకు గుర్తుగా ప్రతి సంవత్సరం బలిపాడ్యమి రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పురోహిత కుటుంబానికి చెందిన ఓ బాలుడికి శివుని వేషధారణ వేసి, గాడిదపై కూర్చోబెట్టి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
యుద్ధానికి ప్రతీకగా పేడ ఓకుళి!
సోమేశ్వర స్వామి, భైరవరాజు అనుచరుల మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీకగా గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారని చెబుతారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మైదాన ప్రాంతాల కుక్కె సుబ్రహ్మణ్యంగా పేరొందిన ససలు క్షేత్రంలో జరిగే ఈ అరుదైన దీపావళి వేడుక స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతోంది. సాధారణంగా దీపావళిని దీపాలతో జరుపుకుంటే, ససలు గ్రామస్థులు మాత్రం ఆవు పేడతో ప్రత్యేక వేడుక నిర్వహించడం విశేషం. ఈ వింతైన ఆచారం ప్రతి ఏడాది భక్తులు, పర్యాటకులు, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
