బుల్లితెర నటి ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి.. వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్..
ముంబైలోని రన్‌వాల్ టవర్స్‌లో దీపావళికి ముందు జరిగిన అగ్నిప్రమాదం నుంచి టెలివిజన్ నటి దివ్యంగా త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియా కవల పిల్లలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే, భవనంలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న ధన్‌పత్ ఊపిరి ఆడాక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషదాన్ని నింపింది.

ప్రముఖ టెలివిజన్ నటి దివ్యంగా త్రిపాఠి, ఆమె భర్త వివేక్ దహియా నివసించే ముంబైలోని అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి పండుగకు సరిగ్గా ముందు రోజు రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఊహించని ప్రమాదం నుంచి ఈ స్టార్ కపుల్ తమ కవల పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారు.అయితే, ఈ ప్రమాదం నుంచి తాము ఆస్తినష్టంతో మాత్రమే బయటపడ్డామని మొదట భావించామని, కానీ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ మరణ వార్త తమను తీవ్రంగా కలచివేసిందని దివ్యంగా, వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు దక్కాయన్న సంతోషం కంటే, తమను నిత్యం కనిపెట్టుకుని ఉండే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం తమను ఎంతో బాధిస్తోందని వారు తెలిపారు.ముంబై అందేరీలోని రన్‌వాల్ టవర్‌లో ఈ అవాంతరం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఈ జంట కుటుంబ సభ్యులతో కలిసి బయటకు పరుగులు తీశారు. అప్పటికే అపార్ట్‌మెంట్ అంతటా దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
ఈ ప్రమాదంలో తీవ్రంగా అస్వస్థతకు గురైన సెక్యూరిటీ గార్డ్ ధన్‌పత్‌ను వెంటనే కూపర్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పొగ పీల్చడం వల్ల ఊపిరి ఆడక ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.ధన్‌పత్ కేవలం భవనానికి కాపలాదారు మాత్రమే కాదని, తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగాడని దివ్యంగా త్రిపాఠి భావోద్వేగ పోస్ట్ రాశారు. తమ కవల పిల్లలను మొదటగా అభినందించిన వ్యక్తుల్లో ఆయన ఒకరని, తమ దైనందిన జీవితంలో ఆయన ఎంతో ఆప్యాయంగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
భవనంలోని సీ వింగ్‌లో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడంతో పెను ప్రమాదం తప్పిందని, మంటలను త్వరగా అదుపులోకి తీసుకురాగలిగామని నివాసితులు తెలిపారు. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆ భవనంలోనే పనిచేస్తున్న ధన్‌పత్ మృతి పట్ల స్థానికులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ విషాద ఘటనకు సంబంధించిన వార్త టెలివిజన్ పరిశ్రమలోను, సోషల్ మీడియాలోనూ తీవ్ర విచారాన్ని నింపింది. సెలబ్రిటీలు, అభిమానులు ధన్‌పత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సంతాపం ప్రకటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
దివ్యంగా త్రిపాఠి పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
