Priya Bhavani Shankar: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్.. పదేళ్ల ప్రేమకు సింపుల్‌గా వివాహం..
ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు జరుగుతున్నాయి. మెగాహీరో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం, హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వార్తలు, అటు అనిరుధ్-కావ్య మారన్ వివాహ వార్తల మధ్య.. 'ఇరుముడి' హీరోయిన్, ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ తన చిరకాల ప్రియుడు రాజ్‌వేల్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనదైన నటనతో, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఇటీవలే రవితేజ సరసన ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అడుగు వేశారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమె ఎట్టకేలకు తన చిరకాల ప్రియుడితో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహ వేడుక చెన్నైలో అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రియా భవానీ శంకర్ సినిమాల్లోకి రాకముందు నుంచి తనతో పాటు ప్రయాణిస్తున్న రాజ్‌వేల్ అనే యువకుడిని ప్రేమించిన విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నటిగా ఎదిగిన ప్రియా భవానీ శంకర్‌కు రాజ్‌వేల్ మొదటి నుంచి ఎంతో సపోర్ట్‌గా నిలిచారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల అంగీకారంతో బుధవారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ప్రియా భవానీ శంకర్ ఇటీవలి కాలంలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘ఇరుముడి’ చిత్రంతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె, పర్సనల్ లైఫ్‌లోనూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియా భవానీ శంకర్. సినిమాల్లో ఎక్కుగా గ్లామర్ షో చేయని ఈ అమ్మడు.. ఇప్పడు ఎలాంటి హడావుడి లేకుండానే తన ప్రియుడితో పెళ్లి పీటలెక్కారు. వీరి వివాహ వేడుక ఎంతో సింపుల్ గా జరిగింది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ప్రియా భవానీ శంకర్ పెళ్లి..
PBK Marriage❤💍
Priya Bhavani Shankar tied the knot with her longtime boyfriend Raj Velu🫂
#PriyaBhavaniShankar #Wedding https://t.co/TVXL2MmnoM
— Movie Buff (@moviesbuff_) November 11, 2026
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
