AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులో తొలి స్టైలిష్ స్టార్ హీరో ఆయనే.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరకు..

సినిమా అనేది గ్లామర్ రంగుల ప్రపంచం. ఎంతో మంది నటీనటులు ఈ రంగంలో ఓ వెలుగు వెలిగి చివరకు ఊహించని విధంగా వెండితెరకు దూరమయ్యారు. అప్పట్లో భారీగా పారితోషికం, లక్షల్లో సంపాదించిన కొందరు తారలు మాత్రం చివరకు దీనస్థితికి చేరుకున్నారు. చుట్టూ చేరిన వాళ్లను నమ్మి మోసపోయినవారు కొందరు అయితే.. ఆస్తులు దానం చేసినవారు మరికొందరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తొలి స్టైలిష్ స్టార్ కూడా అదే కోవకు చెందుతారు.

తెలుగులో తొలి స్టైలిష్ స్టార్ హీరో ఆయనే.. లక్షల్లో రెమ్యునరేషన్.. చివరకు..
Ch Narayanarao
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2026 | 12:45 PM

Share

తెలుగు సినిమా తొలి దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే, 1940ల కాలంలో నాటి చిత్రసీమను ఏలిన మహానటుల పేర్లు గుర్తుకువస్తాయి. అయితే అప్పట్లోనే ఎలాంటి రంగస్థల అనుభవం లేకుండా, ఎవరి సిఫారసులు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి గ్లామర్ హీరోగా, స్టైలిష్ స్టార్‌గా వెలుగు వెలిగిన నటుడు చెదలవాడ నారాయణరావు (సీహెచ్ నారాయణరావు). నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ తొలితరం నటుడి సినీ ప్రయాణం ఆయన జీవితంలోని ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. 1913 సెప్టెంబర్ 13న కర్ణాటకలోని హుబ్లీ సమీపాన జన్మించిన నారాయణరావు పూర్వీకులు మైసూర్ మహారాజా ఆస్థానంలో దివానులుగా పనిచేశారు. ఆయన బాల్యమంతా ఏలూరులో గడిచింది. ఉద్యోగ రీత్యా మద్రాసు వెళ్లిన ఆయన, శోభనాచల స్టూడియోస్ సమీపంలో భోజనం చేస్తుండగా దర్శకుడు ద్రోణంరాజు కామేశ్వరరావు దృష్టిలో పడ్డారు. నారాయణరావు ఆహార్యం, రూపం చూసి ఆకర్షితులైన ఆయన సినిమాల్లో నటిస్తారా అని అడగడంతో నారాయణరావు అంగీకరించారు. అలా 1940లలో వచ్చిన ‘జీవన జ్యోతి’ చిత్రంతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత దశాబ్దం పాటు వరుస చిత్రాల్లో గ్లామర్ హీరోగా మరియు విలన్ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1913 సెప్టెంబర్ 13న కర్ణాటకలోని హుబ్లీ సమీపాన జన్మించిన నారాయణరావు పూర్వీకులు మైసూర్ మహారాజా ఆస్థానంలో దివానులుగా పనిచేశారు. ఆయన బాల్యమంతా ఏలూరులో గడిచింది. ఉద్యోగ రీత్యా మద్రాసు వెళ్లిన ఆయన, శోభనాచల స్టూడియోస్ సమీపంలో భోజనం చేస్తుండగా దర్శకుడు ద్రోణంరాజు కామేశ్వరరావు దృష్టిలో పడ్డారు. నారాయణరావు ఆహార్యం, రూపం చూసి ఆకర్షితులైన ఆయన సినిమాల్లో నటిస్తారా అని అడగడంతో నారాయణరావు అంగీకరించారు. అలా 1940లలో వచ్చిన ‘జీవన జ్యోతి’ చిత్రంతో ఆయన హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత దశాబ్దం పాటు వరుస చిత్రాల్లో గ్లామర్ హీరోగా మరియు విలన్ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నారాయణరావు కేవలం నటనకే పరిమితం కాకుండా నాటి యువతను ఆకర్షించే స్టైల్‌ను సృష్టించారు. ‘మొదటి రాత్రి’ చిత్రంలో ఆయన ధరించిన అడ్డగళ్ల చారల బనియను ఆ రోజుల్లో విపరీతమైన ఫ్యాషన్‌గా మారింది. ఆయన నడక, క్రాఫ్ స్టైల్‌ను యువత విపరీతంగా అనుసరించేవారు. అలాగే అప్పట్లోనే నటీనటులకు అభిమాన సంఘాలు ఏర్పడటం నారాయణరావుతోనే మొదలైందని చెప్పవచ్చు. అంతేకాకుండా, ప్రముఖ గాయకుడు ఘంటసాల తన తొలి పాటను ‘స్వర్గసీమ’ చిత్రంలో నారాయణరావు కోసమే పాడటం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వంటి దిగ్గజాలు రంగప్రవేశం చేశాక నారాయణరావుకు అవకాశాలు క్రమంగా తగ్గాయి. కొంతకాలం పాటు సినిమాలకు పూర్తిగా దూరమైన ఆయన, ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేశారు. చివరగా కృష్ణంరాజు నటించిన ‘మధుర స్వప్నం’ చిత్రంలో నటించిన ఆయన, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 1984 ఫిబ్రవరి 14న మద్రాసులో కన్నుమూశారు. తెలుగు సినిమా తొలితరం గ్లామర్ హీరోగా సీహెచ్ నారాయణరావు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

Follow Us