AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లైఫ్ సేవింగ్ గార్డ్స్.. పాములు, తేళ్లు కనిపిస్తే వేటాడి అలర్ట్ చేస్తాయ్.. ఈ కోళ్ల గురించి మీకు తెలుసా..

చీమకోళ్లు లేదా గినియా ఫౌల్ పక్షుల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. పాములు, తేళ్లు, ఇతర కీటకాలను గుర్తించి పెద్దగా అరుస్తూ అప్రమత్తం చేయడం, కొన్ని హానికర పురుగులను ఆహారంగా తీసుకోవడం వీటి ప్రత్యేకత. చాలా ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పెంచుతున్నారు. వీటి గుడ్లకూ డిమాండ్ ఉందని పెంపకందారులు చెబుతున్నారు.

లైఫ్ సేవింగ్ గార్డ్స్.. పాములు, తేళ్లు కనిపిస్తే వేటాడి అలర్ట్ చేస్తాయ్.. ఈ కోళ్ల గురించి మీకు తెలుసా..
Guinea Fowl Farming
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 11, 2026 | 12:26 PM

Share

చీమకోళ్ల పెంపకం జీవవైవిద్యం, పర్యావరణ పరిరక్షణకు ఇండికేటర్స్… వీటి పెంపకం మనుషుల లైఫ్ సేవింగ్‌గా మారుతుంది.. పాములు, తేళ్ళు, విష పురుగుల నుండి ప్రాణాలు రక్షించే “లివింగ్ అలారమ్”… అచ్చం నెమలిని పోలి ఉండే చీమకోళ్లను ఎలాంటి ప్రాంతాలలో పెంచుతారు.. వాటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. ఫామ్ హౌజ్‌లు, నేతలు, అధికారుల అధికారిక గృహాలలో వాచ్ డాగ్‌లా ఉపయోగపడుతున్న చీమకోళ్ల ( గిన్నె కోడి)  పెంపకం గురించి ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి..

పోలీస్ అధికారులైన, ప్రజాప్రతినిధులైనా, ఉన్నత స్థాయి అధికారులకైనా అంగరక్షకులు ఉంటారు.. ధనవంతుల ఫామ్‌హౌస్‌లు, భవనాలకు సెక్యూరిటీ గార్డులు ఉంటారు.. మరి ఆ నివాసగృహాలు, ఫామ్ హౌస్ లోకి పాములు, తేళ్లు వస్తే వాటి నుండి ఎవరు రక్షిస్తారు. పాములు, తేళ్లు విషపురుగుల నుండి భద్రతకోసం ప్రస్తుతం అనుసరిస్తున్న ఏకైక మార్గం చీమకోళ్లు ( గిన్నె కోడి) పెంపకం… చీమ కోడి ఉందంటే ఆ ప్రదేశంలోకి పాములు, తేళ్లు, ఎలాంటి విష పురుగులు రావని అర్థ.. ఒకవేళ వచ్చి ఈ పక్షి కంట పడితే ప్రాణాలు కోల్పోయినట్టే.. ఎంతటి పాములు ఆయన పరుగులు పెట్టాల్సిందే..

ఇవి పాములు, తేళ్లు విషపురుగులను పసిగట్టే సూచికలుగా పని చేస్తాయి.. పాము కనిపించిందంటే అలారం మోగినట్లే అలెర్ట్ చేస్తాయి.. ఏదైనా పెద్దపాము కనిపిస్తే ఈ పక్షులన్నీ ఒక్కచోటకు బిగ్గరగా అరుస్తాయి.. అన్ని జట్టుకట్టి ఆ పాము పై అటాక్ చేస్తాయి… వీటి అరుపులను పట్టే అక్కడ ఏదో క్రిమికీటకాలు, విషపు పురుగులు, పాములు వచ్చాయని పసిగట్టవచ్చు.. ఈ మధ్య కాలంలో ఫామ్‌హౌజ్ కల్చర్ విపరీతంగా పెరిగింది.. వ్యవసాయ క్షేత్రాలు, మినీ పరిశ్రమలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నివాస గృహాలు, గార్డెన్ ఏరియాలలో పాములు, తేళ్ల నుండి రక్షణ కోసం ఏకైక మార్గంగా చీమకోళ్లను పెంచుతున్నారు.

వరంగల్ పరిసరాల్లో చీమకోళ్ళ పెంపకం విపరీతంగా పెరిగింది.. వీటి ద్వారా కేవలం పాములు కోళ్ల నుండి భద్రత మాత్రమే కాదు వ్యవసాయ క్షేత్రాలలో క్రిమికీటకాల నుండి కూడా రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. పాము కనిపిస్తే పొడిచి పొడిచి చంపే ఈ కోళ్లు తేళ్లు కనిపిస్తే వాటిని ఆహారంగా మింగేస్తాయి.. వ్యవసాయ క్షేత్రంలోని కొన్ని రకాల కీటకాలను పూర్తిగా నివారిస్తాయి. ఇవి తేళ్లను పూర్తిగా తినేస్తాయని కొన్ని శాస్త్రీయపరిశోధనల్లో రుజువయింది.. వీటి గుడ్లకు కూడా విపరీతంగా డిమాండ్ ఉంటుంది.. చీమకోళ్ల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాణాలు కాపాడే ఇండికేటర్స్ గా భావించాలని వీటి పెంపకం దారులు అంటున్నారు.

వీడియో చూడండి..

Follow Us