మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరుగుదొడ్లలో నీటి కొరత తీవ్రంగా ఉంది. "నీళ్లు లేవు, బందు, రేపు రాగలరు" అనే బోర్డు ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని రెగ్యులర్ ప్రయాణికులు కోరుతున్నారు. ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో మరింత తీవ్ర సమస్యలు తలెత్తుతాయేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.