సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలో మధ్యాహ్నం 2:30 గంటలకు చాలా మంది వైద్యులు విధుల్లో లేరని, కొందరు రేపటి అటెండెన్స్‌ను కూడా ముందుగానే వేసి వెళ్లారని కనుగొన్నారు. ఈ అక్రమాలను చూసి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.