AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: అబ్బబ్బా.. ఏం పాటరా బాబూ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న మాధురి రాథోడ్ కొత్త ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్ ఎంతగా దుమ్మురేపుతున్నాయో చెప్పక్కర్లేదు. వారం వారం ఒక్కో కొత్త పాట రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇక ఫోక్ ప్రపంచంలో మాధురి రాథోడ్, ఈశ్వర సాయి జోడికి ఎంతటి క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ ఫోక్ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో చెప్పక్కర్లేదు. తాజాగా ఓ సాంగ్ మాత్రం నెట్టింటిలో తుఫాను క్రియేట్ చేస్తుంది.

Folk Song: అబ్బబ్బా.. ఏం పాటరా బాబూ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న మాధురి రాథోడ్ కొత్త ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
Trending Folk Song
Rajitha Chanti
|

Updated on: Nov 11, 2026 | 12:02 PM

Share

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్న రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫోక్ ప్రపంచంలో అత్యంత క్రేజీ ఫాలోయింగ్ ఉన్న మాధురి రాథోడ్, ఈశ్వర సాయి జంటగా నటించిన ఈ పాట ఇప్పుడు నెట్టింట దుమ్మురేపుతుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పక్కా ఊరమాస్ బీట్స్‌తో రూపొందిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను, ముఖ్యంగా జానపద ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఈ సాంగ్ పేరు తంగేడు చెట్ల కింద. ఈ పాట ప్రారంభం నుంచే శ్రోతలను కుర్చీలో కూర్చోనివ్వకుండా చేసే ఊపుతో సాగుతుంది. తెలంగాణ అచ్చమైన యాస, జానపద వాతావరణం ఉట్టిపడేలా సాగే ఈ పాటలో మాధురి, ఈశ్వర సాయి స్టెప్స్ మరింత హైలెట్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

ఇక ఈ పాట ఇప్పుడు డీజేలలో మోగిపోతుంది. పెళ్లిళ్లు, గ్రామాల్లో జరిగే పండగలు, డీజే పార్టీల్లో ఈ పాట ఇప్పుడు మస్ట్ సెలెక్షన్‌గా మారిపోయింది. ప్రస్తుతం యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. గడ్డం సంతోష్, ప్రభ కలిసి పాడిన ఈ పాట ఇప్పుడు ఫోక్ లవర్స్ ను ఊర్రూతలూగిస్తుంది. ఫోక్ పాటకు డీజే వైబ్ మిక్స్ చేసి రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. విడుదలైన తక్కువ సమయంలోనే వేల సంఖ్యలో లైక్‌లు సాధిస్తూ, యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఈ మాస్ సాంగ్ పల్లెటూరి మాధుర్యాన్ని మరోసారి నూతన హంగులతో ప్రేక్షకులకు పంచింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

మొత్తానికి చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సాంగ్ మరోసారి వీరి క్రేజ్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఈ పాట నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా ఇన్ స్టా, సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా తెగ పాపులర్ అవుతుంది. ఇంతకీ మీరు ఈ పాట విన్నారా.. ? అయితే వినేయండి.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

తంగేడు చెట్ల కింద సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us