హైదరాబాద్లోని ఎల్బీనగర్ సిరినగర్ కాలనీలో అర్ధరాత్రి బైకుల దహనం స్థానికంగా కలకలం సృష్టించింది. గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులకు నిప్పు పెట్టగా, ఒక బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.