AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా నాన్న కాదు.. టీమిండియాలో ఆ ప్లేయర్ అంటే నాకిష్టం.. ఆర్యవీర్ సెహ్వాగ్

Aryaveer Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అండర్-19 ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై సెంచరీతో మెరిశాడు. తన బ్యాటింగ్‌తో తండ్రి వారసత్వాన్ని చాటుతూనే, విరాట్ కోహ్లీలా ఆడాలని కోరుకుంటున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ నిలకడ, ఫిట్‌నెస్‌ను ఆర్యవీర్ ఆదర్శంగా తీసుకుంటున్నాడు.

మా నాన్న కాదు.. టీమిండియాలో ఆ ప్లేయర్ అంటే నాకిష్టం.. ఆర్యవీర్ సెహ్వాగ్
Aryaveer Sehwag With Father
Venkata Chari
|

Updated on: Nov 11, 2026 | 12:37 PM

Share

Aryaveer Sehwag: భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 168 బంతుల్లో 160 పరుగులు (17 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి శతకంతో చెలరేగాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తండ్రి వారసత్వాన్ని కొనసాగించే సంకేతాలు ఇచ్చాడు.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

అయితే తన బ్యాటింగ్‌కు సంబంధించి ఆర్యవీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అండర్-19 ఆసియా కప్ ప్రచార వీడియోలో మాట్లాడుతూ, తాను కేవలం తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ లాగా కాకుండా, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలా ఆడాలని కోరుకుంటున్నట్లు ఆర్యవీర్ తెలిపాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆర్యవీర్ భావిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

వీరేంద్ర సెహ్వాగ్ దూకుడైన ఆటతీరుకు పేరుగాంచగా, విరాట్ కోహ్లీ నిలకడైన ప్రదర్శన, అద్భుతమైన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందాడు. ఈ ఇద్దరు దిగ్గజాల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్యవీర్ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. యూఏఈ పై సాధించిన ఈ సెంచరీ ఆర్యవీర్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us