AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం.. కానిస్టేబుల్‌ను 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!

మహారాష్ట్రలోని నవీ ముంబైలో పోలీసుల తనిఖీల సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాహన తనిఖీలను తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు కారుతో పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, బోనెట్‌పై పడిపోయిన అతడిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. కలంబోలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

Watch: తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఘాతుకం.. కానిస్టేబుల్‌ను 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు!
Car Drags Police Constable
Balaraju Goud
|

Updated on: Nov 11, 2026 | 12:35 PM

Share

మహారాష్ట్రలోని నవీ ముంబైలో పోలీసుల తనిఖీల సమయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వాహన తనిఖీలను తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు కారుతో పోలీస్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, బోనెట్‌పై పడిపోయిన అతడిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. కలంబోలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. కలంబోలి ప్రాంతంలోని ఓ రోడ్‌బ్లాక్ వద్ద పోలీసులు సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన స్విఫ్ట్ డిజైర్ కారును ఆపాలని పోలీసులు సంకేతాలు ఇచ్చారు. అయితే కారులో ఉన్న వ్యక్తులు ఆగకుండా వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

కారును అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ దిలీప్ భోయ్‌ను డ్రైవర్ బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆయన కారు బోనెట్‌పై పడిపోయారు. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా సుమారు 200 మీటర్ల వరకు వేగంగా నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే స్పందించిన పోలీసులు దిలీప్ భోయ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటన అనంతరం కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ఉపయోగించిన కారుకు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్నట్లు గుర్తించారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కలంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను, నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారును గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us