AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంత్రి నివాసంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పరుగులు పెట్టిన సిబ్బంది!

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రి నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ అధికారిక బంగ్లా ‘పావన్‌గఢ్’లో మంటలు చెలరేగాయి. చర్చ్‌గేట్ ప్రాంతంలోని మంత్రాలయ బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి.

మంత్రి నివాసంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పరుగులు పెట్టిన సిబ్బంది!
Fire Breaks Out
Balaraju Goud
|

Updated on: Nov 11, 2026 | 12:45 PM

Share

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మంత్రి నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ అధికారిక బంగ్లా ‘పావన్‌గఢ్’లో మంటలు చెలరేగాయి. చర్చ్‌గేట్ ప్రాంతంలోని మంత్రాలయ బస్‌స్టాప్ ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బంగ్లాలోని ఏసీ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు నాలుగు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉదయం 11:55 గంటలకు ఈ అగ్నిప్రమాదాన్ని లెవల్-1 ఘటనగా ప్రకటించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. బంగ్లాలోని ఏసీ యూనిట్ నుంచే మంటలు ప్రారంభమైనట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరిగినట్లు సమాచారం అందలేదు. అయితే బంగ్లాలో జరిగిన ఆస్తి నష్టం ఎంత? అగ్నిప్రమాదానికి అసలు కారణమేంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక అధికారులు, సంబంధిత సిబ్బంది ఘటనపై తదుపరి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us