AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL New Teams: ఐపీఎల్‌లోకి మరో 2 కొత్త జట్లు..? బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ ఇదే..!

IPL expansion 2028: ఐపీఎల్‌ అభిమానులకు అదిరిపోయే వార్త! ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న టీ20 లీగ్‌లో మరో రెండు కొత్త జట్లు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 సీజన్‌ నుంచి పుణె, వడోదర నగరాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా బీసీసీఐ ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఐపీఎల్‌ 10 జట్ల నుంచి 12 జట్లకు విస్తరించనుంది.

IPL New Teams: ఐపీఎల్‌లోకి మరో 2 కొత్త జట్లు..? బీసీసీఐ మాస్టర్ ప్లాన్‌ ఇదే..!
Ipl 2028 New Teams
Venkata Chari
|

Updated on: Nov 11, 2026 | 1:21 PM

Share

IPL Expansion 2028: ఐపీఎల్‌ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త..! ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో రెండు కొత్త జట్లు చేరబోతున్నాయా? ఇప్పటికే పది జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నీని 12 జట్లకు విస్తరించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పుణె, వడోదర నగరాలు కొత్త జట్లకు కేంద్రాలుగా మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక్కో కొత్త జట్టు విలువ వెయ్యి కోట్ల రూపాయలు కాదు.. ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరవచ్చని అంచనా! అసలు బీసీసీఐ ప్రణాళిక ఏంటి? తెలుసుకుందాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (Indian Premier League) ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన టీ20 లీగ్‌లలో ఒకటి. ఈ టోర్నీకి ఉన్న ఆదరణ, వ్యాపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరో రెండు జట్లను చేర్చే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు మింట్‌ కథనం వెల్లడించింది.

ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే 2028 సీజన్‌ నుంచి కొత్త జట్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తదుపరి మీడియా హక్కుల కాలం 2028 నుంచి 2032 వరకు ఉండటంతో, అదే సమయంలో లీగ్‌ను విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కొత్త జట్ల కోసం పరిశీలనలో ఉన్న నగరాల్లో పుణె, వడోదర ముందంజలో ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Video: 3.2 ఓవర్లలో 7 పరుగులు.. హ్యాట్రిక్‌తోపాటు 6 వికెట్లు.. టీమిండియా బౌలర్ నయా రికార్డ్ గుర్తుందా..?

వడోదర గుజరాత్‌లోని ప్రముఖ క్రికెట్ కేంద్రం. అహ్మదాబాద్‌కు కూడా ఈ నగరం దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌ అహ్మదాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో వడోదరకు కొత్త జట్టు వస్తే గుజరాత్‌లో క్రికెట్ పోటీ మరింత ఆసక్తికరంగా మారవచ్చు.

ఇక పుణెకు ఐపీఎల్‌తో పాత అనుబంధం ఉంది. గతంలో పుణె వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్లు ఈ నగరానికి ప్రాతినిధ్యం వహించాయి. ఇప్పుడు మళ్లీ పుణెకు కొత్త జట్టు వచ్చే అవకాశం ఉందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మింట్‌ కథనం ప్రకారం ఒక్కో కొత్త జట్టు విలువ ఒక బిలియన్ డాలర్లకు మించి ఉండవచ్చని అంచనా. అంటే భారత కరెన్సీలో సుమారు 9 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండే అవకాశం ఉంది.

కొన్ని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, పశ్చిమ ఆసియా పెట్టుబడి నిధులు, భారతీయ వ్యాపార సంస్థలు ఈ అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కథనం పేర్కొంది. అయితే ఇవన్నీ ప్రాథమిక చర్చల దశలో ఉన్న అంశాలే. కొత్త జట్ల యజమానులు ఎవరు? ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

ఇటీవలే రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల యాజమాన్యాల్లో భారీ పెట్టుబడులు జరిగాయి. ఈ పరిణామాలు ఐపీఎల్‌ జట్ల వ్యాపార విలువ ఎంతగా పెరుగుతోందో తెలియజేస్తున్నాయి.

ఎక్కువమంది చదివినది: 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ప్రపంచ రికార్డుతో తొలి టీంగా జింబాబ్వే సంచలన రికార్డ్..!

మరో రెండు జట్లు చేరితే ఆటగాళ్లకు అవకాశాలు పెరగవచ్చు. కొత్త నగరాల్లో క్రికెట్ అభిమానులకు తమ సొంత జట్టు ఏర్పడుతుంది. అయితే మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ వ్యవధి, ఆటగాళ్ల అందుబాటు వంటి అంశాల్లోనూ మార్పులు అవసరమవుతాయి.

మొత్తానికి 2028 నుంచి ఐపీఎల్‌ 12 జట్లతో జరిగే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పుణె, వడోదరలో కొత్త జట్లు వస్తే వాటికి ఎలాంటి పేర్లు పెడతారు? ఎవరు యజమానులుగా వస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us