డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?

ఏపీలో సంక్షేమ పథకాల వ్యవహారం ఉన్నత న్యాయస్థానానికి చేరింది. అటు APలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధుల విడుదలను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు..

డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?

|

Updated on: May 07, 2024 | 7:00 PM

ఏపీలో సంక్షేమ పథకాల వ్యవహారం ఉన్నత న్యాయస్థానానికి చేరింది. అటు APలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ఎన్నికల కమిషన్‌ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నిధుల విడుదలను అడ్డుకోవడంపై విద్యార్థులు, రైతులు- హైకోర్టు తలుపుతట్టారు. చేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. 2019 నుంచి అమలు అవుతున్న పథకాలను అడ్డుకోవడం టీడీపీ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు వైసీపీ నేతలు. కూటమికి మేలుచేసేందుకే ఈసీ డీబీటీ స్కీమ్స్‌కు బ్రేకులు వేసిందన్నారు. జూన్ 4 తర్వాత పథకాలు యధావిధిగా అందుతాయన్నారు సీఎం జగన్‌. బాబు కుట్రలు, కుటిల రాజకీయాల వల్లే ఈరోజు పేదలకు స్కీములు అందడం లేదని మండిపడ్దారు సీఏం జగన్‌. ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇస్తున్నారు వైసీపీ నాయకులు. పోలవరం టీడీపీకి ఏటీఎమ్‌గా మారిందన్న ప్రధాని అదే నాయకులతో వేదిక పంచుకున్నారని ఆరోపించారు. ఇక కేంద్రంలోని నీతి ఆయోగ్‌ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లు పెడితే బీజేపీ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైసీపీ నేతలు. కూటమి నేతలు తప్పుడు ప్రచారంపై బీజేపీ సమాధానం చెప్పాలంటోంది అధికారపార్టీ.

Follow us
Latest Articles