Cancer: రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..

ఇక క్యాన్సర్‌ కేసుల్లో మెజారిటీ ఊపిరితిత్తులవి నమోదవుతున్నాయి. సాధారణంగా స్మోకింగ్ చేసే వారిలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాలుష్యం ఇతర కారణాలతో కూడిన లంగ్‌ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పరోక్షంగా పోగాకు గురయ్యే వారిలోనూ లంగ్‌ క్యాన్సర్‌ వచ్చిన సందర్భాలు ఉన్నాయి....

Cancer: రోజూ పెరుగు తింటే.. ఆ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు..
Curd Health
Follow us

|

Updated on: May 17, 2024 | 9:06 AM

ప్రపంచాన్ని భయపెడుతోన్న అంశాల్లో క్యాన్సర్‌ మహమ్మారి ఒకటి. ఈ మాయదారి రోగం ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం అంత సులువు కాదు. వైద్య రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎంత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా క్యాన్సర్‌ మహమ్మారిని మాత్రం పూర్తిగా జయించలేని పరిస్థితి. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతోంది.

ఇక క్యాన్సర్‌ కేసుల్లో మెజారిటీ ఊపిరితిత్తులవి నమోదవుతున్నాయి. సాధారణంగా స్మోకింగ్ చేసే వారిలో క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాలుష్యం ఇతర కారణాలతో కూడిన లంగ్‌ క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పరోక్షంగా పోగాకు గురయ్యే వారిలోనూ లంగ్‌ క్యాన్సర్‌ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నవారిలో సుమారు 20% మంది సిగరెట్ల జోలికి వెళ్లనివారే ఉన్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే జీవన విధానంలో చేసుకునే మార్పుల ద్వారా ఈ క్యాన్సర్‌ మన దరిచేరకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుందని తెలిసిందే. అయితే తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకుంటే ఊపిరిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇదేదో అషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పరిశోధనలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగుతో పాటు ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 17% తక్కువగా ఉంట్టున్నట్ట తేలింది. ఇందుకోసం పరిశోధకులు మొత్తం 14 లక్షల మందిని పరిగణలోకి తీసుకొని వారిపై పరిశోధనలు నిర్వహించారు. భవిష్యత్తులో లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో పెరుగు, ఫైబర్‌ కంటెంట్ కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!