AP News: అనుమానస్పదంగా రోడ్డు పక్కన కనిపించిన కారు.. డోర్లు బ్రేక్ చేసి లోపల చెక్ చేయగా

ఆ ప్రాంతంలో ఇటీవల చోరీలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు అంతా అలెర్ట్‌గానే ఉన్నారు. ఇటీవల మిడ్ నైట్ ఓ కారు ఆ ప్రాంతానికి వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని వివరాలు అడిగే ప్రయత్నం చేశారు స్థానికులు. ఈ క్రమంలో....

AP News: అనుమానస్పదంగా రోడ్డు పక్కన కనిపించిన కారు.. డోర్లు బ్రేక్ చేసి లోపల చెక్ చేయగా
Ganja Inside Car
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 27, 2024 | 5:49 PM

అది అనకాపల్లి జిల్లాలోని ఓ ప్రాంతం..! అక్కడ ఈ మధ్య కాలంలో చోరీలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు కాపు కాసారు. ఇదే సమయంలో ఓ రెడ్ కలర్ కార్.. వచ్చి ఆగింది. అర్ధరాత్రి అనుమానంగా ఉంది. అప్పుడే అక్కడున్న వాచ్‌మెన్‌కు ఆ కారులోని మనుషులపై అనుమానం కలిగింది. వీళ్ళెవరో దొంగల్లా ఉన్నారు బాబోయ్ అంటూ… స్థానికులకు సమాచారం ఇచ్చాడు. జనం పోగవుతూ ఉండటంతో.. కారు వదిలి ఇద్దరూ అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోసాగారు. కారు లోపలు ఏముందా అని చెక్ చేద్దామనుకుంటే డోర్లు లాక్ అయి ఉన్నాయి. సరే అనుకొని.. కారు ఉంది కదా మళ్లీ వస్తారులే.. లేకుంటే చూద్దాం అనుకున్నారు అక్కడి జనాలు. అనుకున్నట్టగానే మెల్లగా ఒకడు కారు వద్దకు చేరుకున్నాడు. అప్పటికే మాటు వేసిన స్థానికులు వాడిని పట్టుకున్నారు. కారు ఓపెన్ చేయమంటే..  పొంతన లేని సమాధానం చెప్పాడు. ఎందుకంటే మరొకడు ఆ లాక్ చేసి వెళ్లిపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పట్టుబడిన వాడిని కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.. అక్కడ మెకానిక్‌ని పిలిపించి… కారు డోర్లను ఓపెన్ చేశారు. లోపల పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. అనుమానాస్పదంగా ఆపిన కారును గుర్తించిన స్థానికులు.. సంతోష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా కారు లాక్ చేసి పారిపోయడు మరొకడు. కారును మెకానిక్ సాయంతో డోర్లు ఓపెన్ చేయాడంతో భారీగా గంజాయి కనిపిచ్చింది. 300 కిలోల గంజాయి స్వాదీనం చేసుకుని.. గంజాయితోపాటు తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు సీజ్ చేశారు. పారిపోయిన సింగ్ కోసం గాలిస్తున్నారు. ఏజెన్సీ నుంచి గంజాయి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు ప్రాథమిక గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు మరొకటి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్