AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naresh : ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఆయన పైరసీ గురించి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. సినిమా పైరసీ అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద సమస్య. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన రోజే సినిమాలను పైరసీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. ఈ పైరసీ భూతాన్ని అంతం చేయాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు.

Naresh : ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
Naresh
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2024 | 5:47 PM

Share

సీనియర్ నటుడు నరేష్.. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా అద్భుతమైన సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు. తండ్రి పాత్రల్లో అద్భుతంగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల ఆయన పైరసీ గురించి ఆసక్తి కర కామెంట్స్ చేశారు. సినిమా పైరసీ అనేది ఇండస్ట్రీకి చాలా పెద్ద సమస్య. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన రోజే సినిమాలను పైరసీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.. ఈ పైరసీ భూతాన్ని అంతం చేయాలని ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కావడం లేదు. కానీ రీసెంట్ గా ఈ విన్ అనే యాప్ లో శశిమథనం సిరీస్ స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాను దమ్ముంటే పైరసీ చేయండి అంటూ దర్శకుడు సంచలన కామెంట్స్ చేశాడు.

ఇది కూడా చదవండి : Raviteja : ఒరేయ్ ఆజామో.. మన మాస్ రాజా కూతురు మెంటలెక్కించిందిగా..!!

దాంతో అందరూ నిజంగా ఇది సాధ్యం అవుతుంది. ఈవిన్ యాప్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను సిరీస్ లను పైరసీ చేయలేరా అని ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు నటుడు నరేష్ కూడా పైరసీ పై కామెంట్స్ చేశారు. రీసెంట్ గా రాగ్ మయూరి, ప్రియా వడ్లమాని, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన వీరాంజనేయులు విహార యాత్ర సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ఈవిన్ యాప్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి : హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎవ్వరూ పైరసీ చేయలేరు.. ఈవిన్ ఓటీటీ నుంచి మా సినిమాను పైరసీ చేయడం ఎవ్వరికి సాధ్యం కాదు అని అన్నారు. ఈవిన్ యాప్ లోనే ఈ సినిమాను చూడాలి. ఎవ్వరూ పైరసీ చేయలేరు సవాల్ చేస్తున్నాను అని నరేష్ అన్నారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర సినిమా ఆగస్టు 14 నుంచి ఓటీటీలో రానుంది. ఈ సినిమా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి