హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..

కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు , ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది, రాఘవ, గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, రష్మీ హీరో, హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. అయితే వీరిలో ప్రత్యేకంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి.

హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేశా..? ఇప్పుడు సినిమాల్లో అలాంటి పాత్రలు ఇస్తామంటున్నారు..
Hyper Aadi
Follow us

|

Updated on: Jul 27, 2024 | 3:05 PM

ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ ద్వారా చాలా మంది పాపులార్ అయ్యారు. ఈ కామెడీ షో చాలా మందికి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తర్వాత చాలా మందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు. వేణు , ధన రాజ్ లాంటివారు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు. అలాగే హైపర్ ఆది, రాఘవ, గెటప్ శ్రీను ఇలా కొంతమంది కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే సుడిగాలి సుధీర్, రష్మీ హీరో, హీరోయిన్ గా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటున్నారు. అయితే వీరిలో ప్రత్యేకంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి. కామెడీ స్కిట్స్ రాసే దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ కమెడియన్స్ లో ఒకడిగా ఎదిగాడు ఆది. ఆది జోకులకు ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. తన కామెడీ టైమింగ్ తో పంచ్ లతో ప్రేక్షకులను నవ్వించిన ఆది సినిమాల్లోను మెప్పించారు.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

చాలా సినిమాల్లో హైపర్ ఆది కమెడియన్ గా చేశారు. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సినిమాల్లో నటిస్తున్నాడు ఆది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది క్రేజ్ చూసి తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా షాక్ అయ్యారు. ఈ ఇద్దరూ కలిసి సార్ సినిమాలో చేశారు. ఇదిలా ఉంటే హైపర్ అది వల్లే నేను జబర్దస్త్ మానేశా అని ఓ హాట్ బ్యూటీ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..!! టక్కరిదొంగ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటీ..!

ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా ఈ మధ్యకాలంలో బాగా ఫెమస్ అయిన రీతూ చౌదరి. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది. పలు టాక్ షోలకు హోస్ట్ గా చేస్తుంది ఈ భామ. అలాగే టీవీ షోల్లోనూ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రీతూ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆది నేను కలిసి జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్స్ చేశాం.. ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను. ఆది వెళ్ళిపోయినా తర్వాత నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేస్తాను అని నేను కూడా బయటకు వచ్చేసా అని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నేను వీజే అవ్వాలని వచ్చాను.. మెల్లగా ;ఎదుగుతూ.. ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను. కొన్ని టీవీ షోలు చేస్తున్నా అలాగే సినిమాల్లో ఛాన్స్ లకోసం ఎదురుచూస్తున్నా అని తెలిపింది. అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ నేను కాస్త బోల్డ్ కాబట్టి నాకు అలాంటి పాత్రలే ఇస్తాం అంటున్నారు. బోల్డ్ పాత్రలు చేయడానికి నేను రెడీ కానీ దానికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
40 ప్లస్ అయినా తగ్గేదలే అంటున్న సౌత్ హీరోయిన్స్! నార్త్ లో కూడా..
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
ఓరీ దేవుడో.. డ్యాన్స్ చేస్తుండగా వ్యక్తిపై పిడుగుపాటు.. షాకింగ్‌
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం