క్రెడిట్ కార్డు కాదు... సరిగ్గా ఉపయోగించకపోతే మీ పాలిట మహమ్మారి.. మిమ్మల్ని నిలువునా ముంచేస్తుంది కూడా...

క్రెడిట్ కార్డు కాదు… సరిగ్గా ఉపయోగించకపోతే మీ పాలిట మహమ్మారి.. మిమ్మల్ని నిలువునా ముంచేస్తుంది కూడా…

Ravi Panangapalli

|

Updated on: Jul 27, 2024 | 4:27 PM

నిన్న మొన్నటి వరకు క్రెడిట్ కార్డును గర్వంగా చూపించుకునే వాళ్లలో చాలా మంది ఇప్పుడు దాని ద్వారా చేజేతులూ తమ జీవితాల్లో తాము సృష్టించుకున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక నానా అగచాట్లకు గురవుతున్నారు. చివరకు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్న వారి సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతూ వస్తోంది.

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? గత కొద్ది రోజులుగా మినిమమ్ బిల్ మాత్రమే కడుతూ వస్తున్నారా..? ఎస్ .. మీరు మాత్రమే కాదు.. ఇప్పుడు దేశంలో కోట్లాది క్రెడిట్ కార్డు హోల్టర్లలో కనీసం 30-40 శాతం మంది పరిస్థితి ఇదే. దేశంలో రోజు రోజుకీ క్రెడిట్ కార్డుపై పెట్టే ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. అదే సమయంలో చేసిన అప్పుని సమయానికి కట్టలేక… మినిమమ్ బిల్స్ కట్టే వారి సంఖ్య, అదే సమయంలో డీ ఫాల్టర్ల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడూ ఇంతగా లేదు. ఓ వైపు క్రెడిట్ కార్డులు ఇచ్చి జనాల్ని అప్పుల పాలు చేసేందుకు బ్యాంకులు ఎంత తొందర పడుతున్నాయో.. వారి ఉచ్చులో ఇరుక్కొని ఆర్థికంగా చితికిపోతున్న వారి సంఖ్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు క్రెడిట్ కార్డును గర్వంగా చూపించుకునే వాళ్లలో చాలా మంది ఇప్పుడు దాని ద్వారా చేజేతులూ తమ జీవితాల్లో తాము సృష్టించుకున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక నానా అగచాట్లకు గురవుతున్నారు. చివరకు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేందుకు పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్న వారి సంఖ్య గడిచిన కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతూ వస్తోంది.

పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి

ఇలాంటి మరిన్ని కథనాల కోసం టీవీ9 న్యూస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..