AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..

ఈపీఎఫ్‌వో సబ్‌స్కైబర్లకు శుభవార్త. త్వరలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేయనుంది. ఇటీవలే వడ్డీ శాతాన్ని 8.25 శాతంగా నిర్ణయించగా.. రాబోయే కొన్ని నెలల్లో వీటిని ఖాతాల్లో జమ చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో ఉద్యోగులు వీటి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Mar 09, 2026 | 2:54 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో పీఎఫ్ డిపాజిట్లకు వార్షిక వడ్డీని జమ చేయనుంది. నేరుగా ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లోకి వీటిని విడుదల చేయనుంది. గత ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండగా.. ఈ ఆర్ధిక సంవత్సరం 2025-26కు కూడా అదే వడ్డీ రేటును నిర్ణయించింది. మార్చి 2వ తేదీన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయించగా.. కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం కోసం ఫైల్‌ను పంపారు. ఆర్ధికశాఖ ఆమోదం తెలిపాక ఈపీఎఫ్‌వో వడ్డీని చందాదారుల అకౌంట్లలో నేరుగా వేయనుంది. దీంతో వీటి కోసం పీఎఫ్ ఖాతాదారులు ఎదురుచూపులు చూస్తున్నారు.

ఎన్ని రోజులు పడుతుంది..?

వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత చందాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. సాధారణంగా జమ కావడానికి మూడు నెలల పాటు సమయం పడుతుంది. ప్రకటన తేదీ నుంచి అకౌంట్ల జమ కావడానికి మూడు నుంచి 6 నెలల పాటు సమయం పట్టవచ్చు. దీంతో ఉద్యోగులు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రకటన గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటును ఇటీవల నిర్ణయించడంతో డబ్బులు ఎప్పుడు పడతాయోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

8 శాతం కంటే ఎక్కువ ఎందుకు..?

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం, అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు స్థిరమైన, పోటీతత్వ రాబడిని అందించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తోంది. దీంతో 7 కోట్ల మంది ఉద్యోగులకు పదవీ విరమణ భద్రతను బలోపేతం చేసి వారికి ప్రయోజనం కలిగిస్తోంది. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే స్థిరమైన, ఆకర్షణీయమైన రాబడిని అందించడంలో దీని ద్వారా ఈపీఎఫ్‌వో తన నిబద్దతను చాటుతోంది. 8 శాతం కంటే తక్కువ పెట్టుబడి అందిస్తున్న సాంప్రదాయ ఎంపికలతో పోలిస్తే ఈపీఎఫ్ పదవీ విరమణ నిధులు అధిక వేగంతో వృద్ది చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ ఆధారంగా ఈపీఎఫ్‌వో వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా అయినా చూసుకోవచ్చు. ఒకవేళ మీ అకౌంట్ ఇనాక్టివ్ అయినా  58 ఏళ్ల వరకు మీకు వడ్డీ లభిస్తేనే ఉంటుంది. మూడు ఏళ్ల పాటు పీఎఫ్‌కు ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే అకౌంట్ ఇనాక్టివ్ అవుతూ ఉంటుంది. అయినా వడ్డీ పొందటంలో మాత్రం ఎలాంటి సమస్యలు ఉండవు. వడ్డీ అనేది మంత్లీ బ్యాలెన్స్ ఆధారంగా జమ చేస్తారు. మీరు మధ్యలో క్లెయిమ్ చేసుకున్నా వడ్డీ మాత్రం అందుతుంది.

Follow Us