AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. నీచుడా.. చిన్నారిని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల ఆగ్రహం..

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన మహిళపై పగ పెంచుకున్న ఓ వ్యక్తి, ఆమె 18 నెలల కుమారుడిని అపహరించి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఛీ.. ఛీ.. నీచుడా.. చిన్నారిని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్ల ఆగ్రహం..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2026 | 12:31 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.. 18 నెలల పసికందును ఓ వ్యక్తి.. పదేపదే నేలకేసి కొట్టి కిరాతకంగా హత్య చేశాడు.. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. మనస్పర్థల కారణంగా తన బిడ్డతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ.. అతనితో పెళ్లికి నిరాకరించింది. అయితే.. తన పెళ్లికి ఈ చిన్నారి కారణమని.. ఆ వ్యక్తి ఆ మహిళ కుమారుడిని తీసుకెళ్లి నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ భయానక దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. కలవరపరిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిందితుడిపై త్వరితగతిన, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో, నిందితుడు ఆ చిన్నారిని పదేపదే అత్యంత బలంతో నేల మీదకు విసిరేయడం కనిపిస్తుంది. మే 30న “డెడ్లీ కలేష్” అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో నిందితుడిపై కఠిన శిక్ష విధించాలని తీవ్ర ఆగ్రహం, డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఆ వ్యక్తి బాలుడి బంధువుల ఇంటి బయట ఉన్న నిర్మానుష్యమైన సందు గుండా ఆ పసికందును తీసుకువెళ్లి, తర్వాత ఆ పిల్లాడిని పదేపదే బలంగా నేలకేసి కొట్టడం కనిపిస్తుంది. ఈ దారుణమైన దాడి తర్వాత ఆ చిన్నారి కదలకుండా పడి ఉండటం కనిపించింది. గమనించిన కుటుంబసభ్యులు.. ఆ పసికందును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు బాధిత చిన్నారిని రతి.. సుమిత్‌ల కుమారుడైన 18 నెలల ఆరవ్ (కల్లు)గా గుర్తించారు. బాలుడి తల్లి పెళ్లికి నిరాకరించడంతో.. ఆ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొంటున్నారు.

వీడియో చూడండి..

అసలేం జరిగిందంటే..

ఫిరోజాబాద్‌కు చెందిన రతిదేవి (40) సుమిత్ ఇద్దరూ దంపతులు.. రతిదేవి మహిళ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది.. ఈ క్రమంలో మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయి, తన ఏడాదిన్నర కుమారుడు ఆరవ్‌తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే, విడాకుల విషయంలో ఆమెకు సాయం చేస్తానని జితేంద్ర అలియాస్ విరాజ్ ఆమెకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆ వివాహితపై మనసుపడ్డ విరాజ్.. తన మనసులో మాట ఆమెకు చెప్పి, వివాహ ప్రతిపాదన చేశాడు. అయితే, ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా పెళ్లికి అంగీకరించడంతో రతిదేవిపై విరాజ్ పగ పెంచుకున్నాడు. ఆ పసిపాపను తమ సంబంధానికి అడ్డంకిగా ఉన్నాడని విరాజ్ భావించి ప్లాన్ రచించాడు..

ఈ క్రమంలో రతి శుక్రవారం తన పుట్టింటి నుండి అత్తగారి ఇంటికి వచ్చింది. ఆమె ఎక్కడ ఉందో తెలుసుకున్న విరాజ్ అక్కడికి వచ్చాడు. అనంతరం చాక్లెట్ కొనిస్తానని చెప్పి చిన్నారి ఆరవ్‌ను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో వీధిలో ఆ బాలుడిపై దారుణంగా దాడి చేశాడు.. పదేపదే నేలకేసి కొట్టి చంపాడు.. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే, కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. అక్కడ వైద్య సిబ్బంది అతను మరణించినట్లు ప్రకటించారు.

సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు ఆ ప్రాంతం నుంచి పారిపోవడంతో, అతడిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టి, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు వాముతో చెక్..ఇందులోని థైమాల్ రహస్యం
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఎంత పనిచేశావ్ రా నీచుడా..! చిన్నారిని నేలకేసి కొట్టి..
ఎంత పనిచేశావ్ రా నీచుడా..! చిన్నారిని నేలకేసి కొట్టి..
తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు..
తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు..
త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు.. వింటే ఫిదా కావాల్సిందే..
త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు.. వింటే ఫిదా కావాల్సిందే..
డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు
డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు
ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా..
ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా..
అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్..
అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్..
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 2026-27 నుంచి కొత్త ఫీజు....
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 2026-27 నుంచి కొత్త ఫీజు....