AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajat Patidar : ఒకప్పుడు ఎవరికీ తెలియని రీప్లేస్‌మెంట్ ప్లేయర్.. రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు

Rajat Patidar : రజత్ పాటిదార్‌ ను చిన్నప్పటి నుంచి చూస్తున్న అతని స్నేహితుడు, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ అభిషేక్ పాథ్రోడ్ ఒక ఆసక్తి కరమైన విషయాన్ని పంచుకున్నారు. రజత్‌లో ఎప్పుడూ మారని ఒకే ఒక్క లక్షణం అతని ప్రశాంతత.

Rajat Patidar : ఒకప్పుడు ఎవరికీ తెలియని రీప్లేస్‌మెంట్ ప్లేయర్.. రెండోసారి ట్రోఫీని ముద్దాడనున్న ఇండోర్ కుర్రాడు
Rajat Patidar
Rakesh
|

Updated on: May 31, 2026 | 12:28 PM

Share

Rajat Patidar : ఐపీఎల్‌లో అత్యంత పాపులర్ ఫ్రాంచైజీ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును రజత్ పాటిదార్ నడిపిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. గతేడాది జట్టుకు తొలి ట్రోఫీ అందించి, ఈసారి వరుసగా రెండో ఫైనల్‌కు చేర్చినా, అతను మాత్రం ఎంతో ఒదిగి ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు. ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ కెప్టెన్ కూల్ విజయ రహస్యం ఇదీ. రజత్ పాటిదార్‌ను చిన్నప్పటి నుంచి చూస్తున్న అతని స్నేహితుడు, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ అభిషేక్ పాథ్రోడ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. రజత్‌లో ఎప్పుడూ మారని ఒకే ఒక్క లక్షణం అతని ప్రశాంతత. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆవేశపడకుండా, చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపారు. స్థానిక క్రికెట్ ఆడే రోజుల్లో కూడా రజత్ ఎప్పుడూ ఒకే ప్లాన్‌తో మైదానంలోకి దిగేవాడు కాదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే బీ, సీ, డీ లతో సిద్ధంగా ఉండేవాడని, ఈ ముందస్తు ఆలోచనే ఇప్పుడు అతనికి ఐపీఎల్ కెప్టెన్సీలో ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రజత్ పాటిదార్ తీసుకుంటున్న నిర్ణయాలు అతని పరిణతిని చూపిస్తున్నాయి. బౌలింగ్ మార్పులు చేయడం, ప్రత్యర్థి బ్యాటర్ల వీక్‌నెస్‌ను బట్టి మ్యాచ్-అప్‌లను కాపాడుకోవడం వంటి విషయాలలో రజత్ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. మైదానంలో ఒక ప్లాన్ వర్కవుట్ కానప్పుడు అతను ఎప్పుడూ కంగారుపడడు లేదా ఎమోషనల్ కాడు. ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన కారణం ఉండేలా చూసుకుంటాడని కోచ్‌లు అభినందిస్తున్నారు.

గతేడాది ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతలు రజత్ చేతికి వచ్చినప్పుడు, అతను తన సన్నిహితులతో సరదాగా ఒక మాట అన్నారట. “బహుశా ఆర్‌సీబీ 18 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణను ముగించడానికే నేను కెప్టెన్ అయ్యానేమో” అని జోక్ చేశాడట. కానీ, అన్నట్లుగానే గతేడాది జట్టుకు కప్ అందించి ఆ మాటను నిజం చేశాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి జట్టును ఫైనల్ చేర్చడంతో ఆనాటి మాటలు కేవలం జోక్ కాదని, అది అతని తలరాత అని అభిమానులు నమ్ముతున్నారు.

ప్రస్తుత తరం యువకులు వైట్ బాల్, టీ20 క్రికెట్ వైపు పరుగెడుతుంటే.. రజత్ మాత్రం రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇస్తాడని మాజీ జాతీయ సెలక్టర్ సంజయ్ జగ్దాలే కొనియాడారు. ప్రాక్టీస్ సెషన్స్‌కు అందరికంటే ముందుగా రావడం, అందరూ వెళ్లిన తర్వాత చివరిగా మైదానాన్ని వీడటం రజత్ నైజం. కేవలం సిక్సర్లు మాత్రమే కాదు, గత రంజీ సీజన్లో పంజాబ్‌పై ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా అతను చేసిన డబుల్ సెంచరీనే దీనికి నిదర్శనం.

ఆర్‌సీబీ డైరెక్టర్ మో బోబాట్ మాట్లాడుతూ.. మొదట్లో తాను రజత్‌ను కేవలం స్పిన్‌ను మాత్రమే బాగా ఆడగల స్పిన్-బాషర్ అనుకుని పొరపడ్డానని ఒప్పుకున్నారు. రజత్ బేసిక్స్ చాలా బలంగా ఉంటాయని, పేస్ లేదా స్పిన్ ఏదైనా సరే భయం లేకుండా మిడిల్ ఆఫ్ ది బ్యాట్‌తో ఆడగలడని ప్రశంసించారు. దినేష్ కార్తీక్, ఆండీ ఫ్లవర్‌లతో కలిసి అతను తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడు. ఒకప్పుడు గాయపడిన ఆటగాడి స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా ఆర్‌సీబీలోకి వచ్చిన రజత్, ఈరోజు అదే జట్టుకు తిరుగులేని నయా లీడర్‌గా ఎదగడం నిజంగా విశేషం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌