Viral: వెరైటీ దొంగలు.. చోరీకి వెళ్లి పకోడిలు చేసుకొని తిని.. వీడియో వైరల్.

Viral: వెరైటీ దొంగలు.. చోరీకి వెళ్లి పకోడిలు చేసుకొని తిని.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Jul 27, 2024 | 3:42 PM

ఎవరైనా దొంగతానానికి వెళ్తే ఏం చేస్తారు. దొరికినకాడికి సంచుల్లో సర్దుకుని ఉడాయిస్తారు. కానీ కొందరు దొంగలు వెరైటీగా ప్లాన్‌ చేసారు. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో చక్కగా నచ్చిన వంట చేసుకొని సుష్టిగా భోంచేసి, ఓ దమ్ములాగి, తీరిగ్గా నగా నట్రా మూటగట్టుకొని చక్కా వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నోయిడాలోని పదులకొద్దీ ఇళ్లల్లో చోరీ జరిగింది.

ఎవరైనా దొంగతానానికి వెళ్తే ఏం చేస్తారు. దొరికినకాడికి సంచుల్లో సర్దుకుని ఉడాయిస్తారు. కానీ కొందరు దొంగలు వెరైటీగా ప్లాన్‌ చేసారు. దొంగతనానికి వెళ్లిన ఇంట్లో చక్కగా నచ్చిన వంట చేసుకొని సుష్టిగా భోంచేసి, ఓ దమ్ములాగి, తీరిగ్గా నగా నట్రా మూటగట్టుకొని చక్కా వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నోయిడాలోని పదులకొద్దీ ఇళ్లల్లో చోరీ జరిగింది. ఓ నివాస సముదాయంలో గంటల వ్యవధిలో ఆరు దొంగతనం కేసులు నమోదయ్యాయి. సెక్టార్ 82కు చెందిన శ్రీరామ్ త్రిపాఠి ఇంట్లో రూ.40 లక్షల విలువైన నగదు, బంగారం, ఇతర సామాన్లు చోరీ అయ్యాయి. ఆ సమయంలో వారు కుటుంబంతో కలిసి మధ్యప్రదేశ్‌ వెళ్లారు. ఎలాంటి శబ్దం రాని కొన్ని పరికరాలను ఉపయోగించి, దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. అప్పుడే వారు వంట గదిలోకి వెళ్లి పకోడీలు చేసుకొని ఆరగించారు. తర్వాత చక్కా సామాన్లు సర్దేసుకొని వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన శ్రీరామ్ కుటుంబం ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి లబోదిబోమంది. మరికొన్ని ఇళ్లల్లోనూ అదే పరిస్థితి. రిచా బాజ్‌పాయ్‌ నివాసంలో రూ.3 లక్షల ఖరీదైన ఆభరణాలు పోయాయి. ఆమె ఇంట్లో దొంగలు బీడీలు పీల్చి, పాన్‌ నమిలి, బాత్రూమ్‌లో ఉమ్మేసిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని ఇళ్లల్లో దొరికిన ఆహారం తిన్నారు. ఒకరోజు వ్యవధిలోనే ఇన్ని చోరీలు జరిగేసరికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆ దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. సెంట్రల్ నోయిడా అడిషనల్ డీసీపీ హ్రిదేశ్‌ కఠారియా ఆ దొంగల ముఠాను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.