IND vs SL: మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో చేరిన కీలక ప్లేయర్.. కారణమిదే

భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం (జులై 27) జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్టు బాగా సన్నద్ధమయ్యాయి. అయితే ఈ కీలక మ్యాచ్ కు ముందు

IND vs SL: మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో చేరిన కీలక ప్లేయర్.. కారణమిదే
India Vs Srilanka
Follow us
Basha Shek

|

Updated on: Jul 27, 2024 | 5:13 PM

భారత్-శ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం (జులై 27) జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్టు బాగా సన్నద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ బినురా ఫెర్నాండో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది, స్పీడర్ బినురా ఫెర్నాండో తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడని ఇందులో తెలిపింది. కాగా స్టాండ్‌బైగా రమేష్ మెండిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా భారత్‌తో సిరీస్‌కు ముందు శ్రీలంక జట్టు కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బినురా ఫెర్నాండోకు ముందు, ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా వేలి గాయం కారణంగా ఈ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

నువాన్ తుషారా కంటే ముందు, ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమేరా కూడా గాయపడ్డాడు. దీంతో అతను భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు బినూర ఫెర్నాండో అస్వస్థతకు గురికావడంతో లంక జట్టు కష్టాలు మరింత పెరిగాయి. ఫెర్నాండో కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన లంక ప్రీమీయర్ లీగ్‌లో 13 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. కాగా ఈ సిరీస్‌లో శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు.

ఇవి కూడా చదవండి

శ్రీలంక జట్టు:

దినేష్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), వనిందు హసరంగా, కమిందు మెండిస్, దాసున్ షనక, చమిందు విక్రమసింఘే, బినుర ఫెర్నాండో (స్టాండ్‌బీ ప్లేయర్, రమేశ్ మెండిస్) . మధుశంక, మతీష్ పతిరన్, మహేష్ తీక్షణ, దునిత్ వెలలాగే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..