America: అమెరికాలోని పార్క్‌లో భారీ పేలుడు.! ఎందుకు జరిగిందో తెలుసా.?

America: అమెరికాలోని పార్క్‌లో భారీ పేలుడు.! ఎందుకు జరిగిందో తెలుసా.?

Anil kumar poka

|

Updated on: Jul 27, 2024 | 4:26 PM

అమెరికాలోని ఓ పార్క్‌లో భారీ పేలుడు సంభవించింది. దాంతో అక్కడున్న పర్యాటకులంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అది బాంబు పేలుడు కాదని, నీటి ఆవిరి అని అక్కడి అధికారులు తెలిపారు. అమెరికాలోని యెల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లో మంగళవారం భారీగా హైడ్రోథర్మల్‌ పేలుడు సంభవించింది. దాని తీవ్రత దెబ్బకు అక్కడున్న పర్యాటకులు పరుగులు తీశారు. ప్రకృతిలో మార్పుల కారణంగానే అది జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికాలోని ఓ పార్క్‌లో భారీ పేలుడు సంభవించింది. దాంతో అక్కడున్న పర్యాటకులంతా భయంతో పరుగులు తీశారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే అది బాంబు పేలుడు కాదని, నీటి ఆవిరి అని అక్కడి అధికారులు తెలిపారు. అమెరికాలోని యెల్లోస్టోన్‌ నేషనల్‌ పార్క్‌లో మంగళవారం భారీగా హైడ్రోథర్మల్‌ పేలుడు సంభవించింది. దాని తీవ్రత దెబ్బకు అక్కడున్న పర్యాటకులు పరుగులు తీశారు. ప్రకృతిలో మార్పుల కారణంగానే అది జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్‌ పార్క్‌లోని బిస్కట్‌ బేసిన్‌ అనే ప్రాంతంలోని పార్కింగ్‌ , బోర్డ్‌ వాక్‌ సమీపలో ఈ పేలుడు చోటుచేసుకొంది. సందర్శకులు ఆ చెరువు సమీపంలో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా కొన్ని వందల మీటర్ల ఎత్తులో నీరు, ఆవిరి ఎగిసిపడ్డాయి. అసలు అక్కడ ఏం జరుగుతోందో వారికి అర్థం కాక అందరూ తలో దిక్కూ పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

మరోవైపు అమెరికా భూభౌతిక సర్వే విభాగం మాత్రం దీనిని హైడ్రోథర్మల్‌ పేలుడుగా చెబుతోంది. భూమి అడుగున ఉన్న నీరు వేగంగా వేడెక్కి ఆవిరిగా మారడంతో.. ఒత్తిడి పెరిగి భయంకరమైన పేలుళ్లు జరుగుతాయని పేర్కొంది. ఆ సమయంలో నీరు, నీటి ఆవిరి, బురద, రాళ్లు కొన్ని వందల అడుగుల ఎత్తున ఎగిరిపడతాయని వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఈ పేలుళ్లు 100 మీటర్ల గోతులను కూడా సృష్టిస్తాయని తెలిపింది. 1989లో ఇక్కడి పోర్క్‌చాప్‌ గీజర్‌ బేసిన్‌లో ఇలాంటి భారీ పేలుడు చోటుచేసుకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నారిస్‌ గీజర్‌ బేసిన్‌లో చిన్నస్థాయి ఘటన చోటుచేసుకొంది. కాగా, ఈ పార్క్ ప్రాంతంలో అగ్నిపర్వతం బద్ధలయ్యే అవకాశం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుత సంభవించిన ఈ పేలుడు లావా కదలికలను సూచించడం లేదన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.