Golden Fish: జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!

పులస చేపకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క చేప దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్టే.. ఇక తిన్న వారి జన్మ ధన్యమైనట్టే.. అట్లుంటది పులస తోని. ఈ పులసకు పోటీ మరో చేప బంగారు తీగ. ఇది కూడా పులసకు తక్కువేమీ కాదు. వర్షాకాలంలో ఉప్పొంగే నదుల్లో ఎదురీదుతూ వచ్చి మత్స్యకారుల వలలో చిక్కుతుంది ఈ అరుదైన చేప. ఈ చేప చిక్కిందంటే మత్స్యకారుల పంట పండినట్టే. ఇప్పుడు ఈ చేపలు సీలేరు నదిలో సందడి చేస్తూ మత్స్యకారులను ఊరిస్తున్నాయి.

Golden Fish: జాలరి పంట పండింది.. వలలో చిక్కిన బంగారు చేప.!

|

Updated on: Jul 27, 2024 | 4:46 PM

పులస చేపకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క చేప దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్టే.. ఇక తిన్న వారి జన్మ ధన్యమైనట్టే.. అట్లుంటది పులస తోని. ఈ పులసకు పోటీ మరో చేప బంగారు తీగ. ఇది కూడా పులసకు తక్కువేమీ కాదు. వర్షాకాలంలో ఉప్పొంగే నదుల్లో ఎదురీదుతూ వచ్చి మత్స్యకారుల వలలో చిక్కుతుంది ఈ అరుదైన చేప. ఈ చేప చిక్కిందంటే మత్స్యకారుల పంట పండినట్టే. ఇప్పుడు ఈ చేపలు సీలేరు నదిలో సందడి చేస్తూ మత్స్యకారులను ఊరిస్తున్నాయి. కుండపోత వర్షాలు, వరదలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఎర్రని రంగు పులుముకొని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే సమయంలో నీటి ప్రవాహానికి ఎదురీదుతూ రకరకాల చేపలు సరిహద్దులు దాటుతుంటాయి. ఈ క్రమంలో ఇప్పటికే మత్స్యకారులను పులసలు పకలరిస్తుండగా.. తాజాగా బంగారు తీగ చేపలు కూడా వచ్చేశాయి. అత్యంత అరుదైన ఈ చేపలు మత్స్యకారులకు చిక్కితే వారి పంట పండినట్టే. ఎందుకంటే ఇవి సీజనల్‌ చేపలు.. సముద్రంనుంచి వరద నీటితో నదుల్లోకి కొట్టుకొస్తాయి. దాంతో వీటి రంగు, రుచి కూడా మారతాయి. అందుకే ఆ చేపలకు డిమాండ్‌ ఎక్కువ. పుస్తెలమ్మి అయినా పులస తినాలి అంటారు.. అలాగే బంగారు తీగ చేపలు కూడా పులసలకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు నదిలో మత్స్యకారుల వలకు బంగారు తీగ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేవు.

ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది. అల్లూరి సీతారామరాజు జిల్లా లో భారీ వర్షాలకు సీలేరు నదికి వరద నీరు పోటెత్తుతోంది. నది పూర్తిగా రంగు మారి ఎర్రగా కనిపిస్తోంది. దీంతో జాలర్లు చేపల వేటకు స్పీడ్ పెంచారు. జీకేవీధి మండలం సీలేరు నదిలో జాలర్లు యథావిధిగా చేపలు వేటకు వెళ్లారు. ఓ జాలరికి 25కిలోల అతి అరుదైన గెలస్కోపి, మిలట్రీ మౌస్ చేప వలకు చిక్కింది. దాన్ని వనములు నర్సింగ్ అనే మత్స్యకారుడు విక్రయించడానికి మార్కెట్ కు తీసుకువచ్చాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చివరకు ఓ వ్యక్తి దాన్ని ఆరు వేలకు దక్కించుకున్నాడు. ఈచేప 5 కిలోలనుంచి 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఈచేపలో 68శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఓమెగా 3ఫ్యాటీ అసీడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎన్నో పోషకాలు ఈ చేపలలో ఉంటాయి. నిత్యం నీరు ఉండే లోతైన సీలేరు, డొంకరాయి, బలిమెలా రిజర్వాయర్లలో ఈ చేపలు జీవిస్తాయి. ఈచేపలకు నీటి ప్రవాహానికి ఎదురీదే అరుదైనలక్షణం ఉంది. కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకొని రిజర్వాయర్ లోకి వస్తుంటాయని అంటున్నారు మత్స్యకారులు .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us