కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను..

TV9 Telugu

12 June 2024

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్‌కు.. డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

02 సెప్టెంబర్ 1971 ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు కొణిదెల పవన్ కళ్యాణ్.

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో హీరోగా చలనచిత్ర తెరంగేట్రం చేసిన పవన్ స్టార్ హీరోగా ఎదిగారు.

తనదైన నటనతో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమేకాక ఎన్నో అవార్డులను అందుకున్నారు. అత్యధిక అభిమానాలను సంపాదించుకున్నారు.

2008 నుంచి 2011 వరకు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడుగా రాజకీయా ప్రవేశం చేసారు.

కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీఎంపిఎఫ్) ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేద ప్రజలకు అనేక సేవలు చేసారు.

2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించి 2019 లో గాజువాక, భీమవరం స్థానాల్లో ఎన్నికలో బరిలో ఓటమి చవిచూశారు.

2024లో కూటమి నుండి జనసేన పార్టీ తరుపున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన 70,000+ ఓట్లు మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు.