Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు.. ఎక్కడంటే

మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో వారి ఆచరాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక చోట వాన దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి ప్రజలు గాడిదలకు గులాబ్‌ జామూన్‌ విందు ఏర్పాటు చేశారు. వినడానికి విచిత్రం అనిపించినప్పటికీ ఇలాంటి వింత సంప్రదాయం మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు.. ఎక్కడంటే
Sweet Treats For Donkeys
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2024 | 5:31 PM

దేశవ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని ప్రాంతాలు నానా అవస్థలు పడుతున్నారు. కుందపోత వర్షాల కారణంగా నగరాలు, పట్టణాలు జలమయంగా మారుతున్నాయి. పెద్ద భవనాలు, వంతెనలు సైతం వరద ఉధృతికి కొట్టుకుపోయిన సంఘటనలు కూడా వార్తల్లో అనేకం చూస్తున్నాం. మరోవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తుండటంతో వారి ఆచరాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక చోట వాన దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి ప్రజలు గాడిదలకు గులాబ్‌ జామూన్‌ విందు ఏర్పాటు చేశారు. వినడానికి విచిత్రం అనిపించినప్పటికీ ఇలాంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో వాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు గాడిదలకు గులాబ్ జామూన్‌ లు తినిపించి పండగ చేసుకున్నారు అక్కడి ప్రజలు. మందసౌర్‌లోని ఒక గ్రామంలో తమ కోరిక మేరకు వర్షం కురిసిన తర్వాత ఇక్కడ ప్రజలు ఇలా గాడిదలకు గులాబ్ జామూన్‌లను తినిపిస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని చాలా చోట్ల నమ్మకం. అదేవిధంగా మధ్యప్రదేశ్‌కు కూడా ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో కరువు నివారణకు గాడిదలకు గులాబ్ జామును తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల వరుణుడి అనుగ్రహం లభిస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రస్తుతం ఈ సంప్రదాయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, గ్రామస్థులు గాడిదలకు గులాబ్ జామూన్ తినిపిస్తున్నారు. గాడిదలకు స్నానం చేయించి, పూలమాలలు వేసి పూజించి, తీపి భోజనం, ముఖ్యంగా గులాబ్ జామూన్ తినిపించడం ఇక్కడి సంప్రదాయం. ఇలా చేస్తే మరిన్ని మంచి వర్షాలు కురుస్తాయని నమ్మకంగా చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..